Mugguru Monagallu Trailer review: ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ రివ్యూ

కామెడీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ముగ్గురు మొనగాళ్లు మూవీ ట్రైలర్ (Mugguru Monagallu Trailer) తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ ముగ్గురు కలిసి మంచి కామెడీ పండించినట్టు ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2021, 04:19 PM IST
Mugguru Monagallu Trailer review: ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ రివ్యూ

కామెడీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ముగ్గురు మొనగాళ్లు మూవీ ట్రైలర్ (Mugguru Monagallu Trailer) తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ ముగ్గురు కలిసి మంచి కామెడీ పండించినట్టు ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ముగ్గురికి ఉన్న ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే... ముగ్గురు మూడు రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్లే. ఒకరికి చెవులు వినపడవు, మరొకరికి కళ్లు కనబడవు, ఇంకొకరికి మూగ. ఈ ముగ్గురి జీవితంలో చోటుచేసుకున్న ఘటనలతోనే దర్శకుడు కామెడీ థ్రిల్లర్ ని అల్లుకున్నాడని ముగ్గురు మొనగాళ్లు మూవీ ట్రైలర్ చెబుతోంది. 

అయితే, ముగ్గురు నిజంగానే దివ్యాంగులా లేక చాలా సినిమాల్లో మాదిరిగానే పరిస్థితుల నేపథ్యంలో అలా అబద్దం చెప్పాల్సి వస్తుందా అనేదే సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అదే సమయంలో హైదరాబాద్‌లో జరుగుతున్న వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ వీరినే ప్రధానంగా టార్గెట్ చేయనున్నట్టు చెప్పడం ద్వారా మూవీపై ఇంకొంచెం గ్రిప్ పెరిగేలా చేశాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి (Director Abhilash Reddy).

Also read : Salaar movie: Prabhas కి విలన్‌గా మారుతున్న John Abraham

ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే... ఇటీవలె కరోనాతో కన్నుమూసిన ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్, నటుడు టీఎన్నాఆర్ (TNR's death) కూడా ఓ ముఖ్యపాత్రలో నటించడం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News