RRR Ticket Price: మూవీ లవర్స్ చాలా కాలంగా ఎదురుచుస్తున్న సినిమా 'ఆర్​ఆర్​ఆర్​'. ఎన్నోసార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. విడుదలకు ముందే వివిధ రికార్డులు సృష్టించిన 'ఆర్​ఆర్​ఆర్​'.. ఇప్పుడు టికెట్​ రేట్ల విషయంలో కూడా సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే.. థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అలాంటిది ఇద్దరు స్టార్స్​ ఒకే సినిమాలో అది కూడా దర్శక ధీరుడు రాజమౌలి మూవీ కావడంతో ఈ మూవీపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్లే చిత్ర దర్శకుడు రాజమౌలి సహా రామ్​ చరణ్​, ఎన్​టీఆర్​లు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాలన్నీ తిరిగి ప్రమోషన్స్ కూడా చేశారు.


భారీ బడ్జెట్ సినిమా కావడంతో మూవీ టికెట్ ధరలను పెంచింది చిత్ర బృందం. ఇందుకు పలు రాష్ట్రాలు అధికారికంగా అనుమతి కూడా ఇచ్చాయి. దీనితో చాలా ప్రాంతాల్లో టికెట్ రేట్లు గతంలో ఎన్నడూ చూడనంతగా పెరిగాయి.


ఆర్​ఆర్​ఆర్​ మూవీ కూడా.. సాధారణ 2డీతో పాటు.. 3డీ ప్లాటినం, డోల్బీ పిక్చర్స్ వంటి ఫార్మాట్లలో విడుదలవుతున్నాయి. దీనితో ఫార్మాట్ల వారీగా ఒక్కో టికెట్​ ధర ఒక్కో విధంగా ఉన్నాయి.


టికెట్ల ధరలు చూస్తే షాకవ్వాల్సిందే..


ఢిల్లీ ఎన్​సీఆర్ ప్రాంతంలో త్రీడీ ప్లాటినం స్కీన్​లో ఒక్కో టికెట్ ధర రూ.2,100గా విక్రయం అవుతోంది. అయితే ఏ బ్లాక్​లోనూ ఇంత ధర ఉందనుకుంటే పొరపాటే. నేరుగా బుక్​మై షోలోనే ఈ ధరకు టికెట్లు విక్రయమవుతున్నాయి. ఇక కేవలం త్రీడీలో అయితే ఈ ధర రూ.1,900గా ఉంది. 3డీ స్క్రీన్ రిక్లైనర్​ సీట్లకు టికెట్ ధరలు రూ.1,720గా ఉంది.


ముంబయిలోనే ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 3డీ రిక్లైనర్​ సీట్లకు టికెట్​ ధర రూ.1,720గా, కోల్కతాలో ఒక్కో టికెట్ ధర రూ.1,090గా ఉంది.


అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమిటంటే.. ఈ ధరలన్నీ పన్నులు లేకుండానే. జీఎస్​టీ కలిపితే ఈ ధరలు మరింత పెరగనున్నాయి.


ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారికంగా ధరలు పెంచడంతో.. రికార్డు ధరలో ఆర్​ఆర్​ఆర్​ టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇంత ధర ఉంది కదా కొనేవాళ్లు ఎవరున్నారు లే అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే. ఎందుకంటే ధరలు ఈ రేంజ్​లో పెరిగినా.. చాలా థియేటర్లలో, మల్టీప్లేక్స్​లలో హౌస్​ ఫుల్​ బుకింగ్స్ అయ్యాయి.


Also read: RRR Team: గ్రీన్ ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్, మొక్కలు నాటిన రాజమౌళి, రామ్‌చరణ్, తారక్


Also read: Amritha Aiyer Photos: పట్టుచీరలో అమృత అయ్యర్.. అమ్మాయి గారిని ఇలా ఎప్పుడు చూసుండరు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook