Making Video Of RRR: బాహుబలి ప్రాజెక్టు అనంతరం టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఆర్ఆర్ఆర్ అప్‌డేట్స్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చేసింది. ముందు చెప్పినట్లుగానే నేటి ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం మేకింగ్ (Roar Of RRR Movie) వీడియోను విడుదల చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్, దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది. సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు.


Also Read: Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా అక్టోబర్‌లో ప్రారంభం



కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా హీరో రామ్ చరణ్ పోషించాడు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, రామ్ చరణ్‌ (Ram charan)కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోంది. బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్, శ్రీయ కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్‌ఆర్‌(RRR Poster Editing Photos)కు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. సినిమా డిజిటల్ రైట్స్‌కు పలు సంస్థలు భారీగా చెల్లించాయి.


Also Read: SS Rajamouli: టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి అసహనం, ఏ ఫీలింగ్ కలుగుతుందని ట్వీట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook