SS Rajamouli at Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీ, ఓ అంతర్జాతీయ నగరం. శతాబ్దాల తరబడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న నగరంలోని ఎయిర్‌పోర్టులో పరిస్థితులు చూసి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఆశ్చర్యానికి లోనయ్యారు. కనీస వసతులు కూడా లేకపోతే విదేశీయులకు మనపై ఏ గౌరవం ఉంటుందని సోషల్ మీడియా వేదిగా ప్రశ్నించారు.
తాను ఎదుర్కొన్న పరిస్థితి టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రెండు ట్వీట్లలో పోస్ట్ చేశారు. ‘లుఫ్తాన్సా విమానంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. అక్కడ సిబ్బంది తమకు ఆర్టీపీసీఆర్ పరీక్షల నిమిత్తం కావాల్సిన కొన్ని పత్రాలు ఇచ్చి.. అందులో వివరాలు రాయాలని సూచించారు. ఆ పేపర్లలో వివరాలు నింపేందుకు కొందరు గోడలకు ఆనుకుని వివరాలు రాసిచ్చారు. మరికొందరు నేలపై కూర్చుని తమ వివరాలు నమోదు చేశారు. ఇలాంటి వాటి కోసం కనీసం ఓ చిన్న టేబులైనా ఏర్పాటు చేయాలి. పరిస్థితి చూడటానికి ఏమాత్రం బాగోలేదు’ అని దర్శకుడు రాజమౌళి (Tollywood Director Rajamouli) ట్వీట్ చేశారు.
Also Read: RRR Poster Editing Photos: ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ క్రేజ్ చూశారా, ఓ రేంజ్‌లో ఎడిటింగ్ చేసిన ఫ్యాన్స్
And surprised to find so many stray dogs in the hangar outside the exit gate. Again not a great first impression of India for the foreigners. Please look into it. Thank you…
— rajamouli ss (@ssrajamouli) July 2, 2021
‘ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చే మార్గంలో అయితే చాలా వీధి కుక్కలున్నాయి. ఇలాంటి వాటిని గమనిస్తే విదేశీయులకు మనపై ఎలాంటి భావన కలుగుతుందో అర్థం చేసుకోండి. కనుక ఇలాంటి పరిస్థితులను కాస్త చక్కదిద్దాలని’ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులకు సూచిస్తూ దర్శకుడు రాజమౌళి మరో ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల షూటింగ్స్ తిరిగి ప్రారంభం కావడంతో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ (RRR Movie Resumes Shoot) జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండు భాషలలో తమ డబ్బింగ్ సైతం పూర్తి చేశారని ఇటీవల మూవీ యూనిట్ తెలిపింది.
Also Read: RRR Movie Updates: ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది, రిలీజ్ డేట్‌పై సైతం మూవీ యూనిట్ క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook