Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా అక్టోబర్‌లో ప్రారంభం

Jr NTR Movie: టాలీవుడ్ హిట్ కాంబినేషన్‌తో మరో సినిమా త్వరలో తెరకెక్కనుంది. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ పూర్తవకుండానే కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 11, 2021, 01:59 PM IST
 Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా అక్టోబర్‌లో ప్రారంభం

Jr NTR Movie: టాలీవుడ్ హిట్ కాంబినేషన్‌తో మరో సినిమా త్వరలో తెరకెక్కనుంది. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ పూర్తవకుండానే కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్. 

తెలుగు సినీ పరిశ్రమలో కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR)లను హిట్ కాంబినేషన్‌గా చెప్పుకుంటారు. ఈ హిట్ కాంబినేషన్ ఆధ్వర్యంలో మరో సినిమా త్వరలో తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) కంటే ముందే కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. రామ్‌చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వాస్తవానికి త్రివిక్రమ్ సినిమా చేస్తున్నట్టు గతంలో ప్రకటించాడు. అయితే ఎందుకో మరి ఆ ప్రాజెక్టును పక్కనబెట్టి..కొరటాల శివ (Koratala Siva)సినిమాకు సై అన్నాడు. హిట్ కాంబినేషన్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ ప్రారంభంలో కొత్త సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. 

కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌తో రానున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో వస్తుందని తెలుస్తోంది. పల్లెటూరి నుంచి వచ్చిన ఓ యువకుడు దేశ రాజకీయాల్ని శాసించేలా ఎదిగిన తీరు సినిమా నేపధ్యంగా ఉంది. పాన్ ఇండియా మూవీగా ఈ కొత్త సినిమా తెరకెక్కబోతోంది. అనిరుథ్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో కియారా అద్వానీ (Kiara Advani)నటింటే అవకాశాలున్నాయి. 

Also read: Roar Of RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్, జులై 15న గెట్ రెడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News