Virupaksha Movie Review: హారర్ థ్రిల్లర్ `విరూపాక్ష` ఎలా ఉందో రివ్యూలో చూసేయండి!
Virupaksha Movie Review and Rating in Telugu: సాయి ధరం తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో భోగవల్లి ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం పదండి
Virupaksha Movie Review in Telugu: రిపబ్లిక్ సినిమాతో డిజాస్టర్ మూట కట్టుకున్న సాయి ధరం తేజ్ చాలా గ్యాప్ తీసుకుని విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు తెలుగులో చేసిన అన్ని సినిమాలతో హిట్ అందుకుంటూ వస్తున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించడం సుకుమార్ సినిమాకి స్క్రీన్ ప్లే అందించడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేయడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగ్జైటెడ్ గా ఉన్నారు . మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.
విరూపాక్ష కథ ఏమిటంటే?
తన తల్లి సొంత ఊరు అనే ఒక ఏజెన్సీ గ్రామానికి తన తల్లితో కలిసి వెళతాడు సూర్య(సాయి ధరమ్ తేజ్). అలా వెళ్ళిన సమయంలో సర్పంచ్ హరిశ్చంద్రప్రసాద్(రాజీవ్ కనకాల) కుమార్తె నందిని(సంయుక్త)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే సూర్య తన ప్రేమ విషయాన్ని నందిని దృష్టికి తీసుకు వెళ్లే లోగా ఊరిలో అనూహ్యంగా ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ ఉంటారు. ఆ ఊరి పూజారి శాసనాలు చూసి ఊరిని అష్టదిగ్బంధనం చేయాలని ఊరి వారు కాని వారంతా బయటకు వెళ్ళిపోవాలని కోరుతారు.. అలా బయటకు వెళ్లినా నందిని అనారోగ్యం దృష్ట్యా సూర్య మరోసారి ఊరిలోకి రావాల్సి వస్తుంది. అలా వచ్చిన సూర్య ఊరికి పట్టిన సమస్యను ఎలా వదిలించాడు? రుద్రవరం మొత్తాన్ని చంపాలని చూసింది ఎవరు? దుష్టశక్తులను సూర్య ఎలా ఎదుర్కొన్నాడు? అందులో అఘోరాలు పాత్ర ఏమిటి? లాంటి విషయాలు సినిమా స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read: Virupaksha Pre Release: సాయి ధరమ్ తేజ్ కెరియర్లో అత్యధిక బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందంటే?
విశ్లేషణ:
సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమలు అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయి అని నమ్మే వాళ్ళు ఎంతగా భయపడతారో ఆ సినిమాలు చూస్తారో, లేవు అని వాదించే వారి సైతం అలాగే భయపడుతూనే సినిమాలు చూస్తారు. దాదాపు కాస్త క్వాలిటీ కలర్ సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. అలాంటి కథని ఎంచుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ వర్మ. మనం సాధారణంగా పేపర్ లలో చూస్తూనే ఉంటాం. చేతబడి నెపంతో మహిళ హత్య, చేతబడి నెపంతో కుటుంబ సామూహిక హత్యలు వంటి వార్తలు.
అలాంటి ఒక వార్తనే సినిమాగా మలిచాడు కార్తీక్. ఊరి చివరన ఉండే వెంకటాచలపతి కుటుంబాన్ని రుద్రవరం గ్రామస్తులంతా కలిసి చంపడం అతని కొడుకుని ఊరి పెద్ద హాస్టల్లో చేర్చడం వంటి విషయాలను ఫస్ట్ హాఫ్ లో చూపించి చూపించినట్లుగా చూపించారు. ఫస్టాఫ్ మొత్తం ఆ ఊరికి ఏర్పడిన వింత సమస్య, ఒక్కొక్కరిగా చనిపోవడం వంటివి చూపారు. ఊరికి వచ్చిన సూర్య నందినితో ప్రేమలో పడటం తన ప్రేమను తగ్గించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫస్ట్ ఆఫ్ లో చూపించారు. తాను ప్రాణంగా ప్రేమించిన నందిని ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకున్న సూర్య ఆమెను రక్షించుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు.
అక్కడితో ఆసక్తికరంగా ఫస్ట్ ఆఫ్ ముగించి రెండో భాగంలోకి తీసుకువెళ్లిన డైరెక్టర్ రెండో భాగానికి వెళ్ళిన తర్వాత కథలో వేగాన్ని పెంచాడు. ఫస్ట్ ఆఫ్ లవ్ సీన్స్ రొటీన్ అనిపించి కథకు అడ్డంకులుగా అనిపిస్తాయి కానీ సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి థియేటర్లలో కుర్చీకి అతుక్కుపోయేలా కళ్ళు పక్కకు కూడా తిప్పకుండా ఉండేలా చూసుకున్నాడు. ఇక ఊరిలో జరిగిన మరణాలకు కారణం ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకున్న సూర్య ఆ ఊరి మొత్తాన్ని ఎలా కాపాడాడు? అనే అంశాన్ని ఆసక్తికరంగా, ఉత్కంఠ రేకెత్తించే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలం అయ్యాడు కార్తీక్ వర్మ. చాలా హారర్ సినిమాలు చూసి ఉంటాం కానీ ఈ సినిమా విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ లో కాస్త లవ్ సీన్స్ బోర్ అనిపించినా కథలోనికి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రేక్షకులు సినిమాలో లేనమైపోతారు. అలాగే అంతర్లీనంగా ఇచ్చిన సందేశం కూడా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.
నటీనటులు:
సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ తర్వాత పూర్తిస్థాయిలో కోలుకొని చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటనలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. అదే విధంగా సంయుక్త ముందుకు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించే అవకాశం ఉన్న పాత్ర దక్కింది. ఇప్పటివరకు ఆమెను గ్లామర్స్ హీరోయిన్గా మాత్రమే చూసిన వారికి ఈ సినిమాలో ఆమె నటన కచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర అంటే రాజీవ్ కనకాలకు మాత్రమే దక్కింది. కాస్త ఫుల్ లెన్త్ రోల్ కావడంతో ఆయన కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక మిగతా పాత్రలలో నటించిన వారందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం:
టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి దర్శకత్వం వహించి కథ కూడా అందించిన కార్తీక్ వర్మ మొదటి సినిమా ఇది అంటే ఎవరు నమ్మరు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు తెరకెక్కించిన విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దడానికి కార్తీక్ వర్మ అనేక ప్రయత్నాలు చేసి చాలావరకు సఫలమయ్యాడు. ఇక సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధాన బలం. ఇక సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే ఆర్ట్ వర్క్ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా చూసిన వారంతా మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు ఆర్ట్ డైరెక్టర్ని మెచ్చుకోకుండా ఉండలేరు. అంతేకాకుండా ఈ సినిమా సాంగ్స్ అంతగా కనెక్ట్ కాకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగినట్టు ఉన్నాయి.
Also Read: Trishara then &now: 'సినిమా బండి'లో స్కూల్ పిల్ల ఇప్పుడు ఎలా తయారయిందో చూశారా? అరాచకం అంటే ఇదే!
ఫైనల్ గా:
విరూపాక్ష పర్ఫెక్ట్ హారర్ థ్రిల్లర్, వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతుంది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారికి ఫుల్ మీల్స్ లాంటి సినిమా.
Rating: 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook