Salaar: కళకళలాడిపోయిన థియేటర్లు…ప్రభాస్ పుణ్యమా అని మళ్లీ అలా…
Salaar Pre Bookings: ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న పాన్ ఇండియా సినిమా సలార్. ఈ చిత్రం కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది అనడంలో సందేహం లేదు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ ని రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీయదమే ఎందుకు ప్రధాన కారణం…
Salaar Tickets: సలార్ సినిమా చూడడానికి ప్రేక్షకులు సిద్ధమైపోయారు. థియేటర్ల వద్ద హంగామా ఓ లెవెల్ లో మొదలైపోయింది. బుక్ మై షో లు పేటీఎంలో .. వచ్చిన ఈ రోజుల్లో కూడా మళ్లీ ఎన్నో సంవత్సరాల తరువాత థియేటర్స్ వద్ద టికెట్ల కోసం బీభత్సమైన సందడి ఏర్పడింది.
స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే కొద్ది సంవత్సరాల క్రితం వరకు థియేటర్ల వద్ద టికెట్ బుకింగ్ కౌంటర్లు కళకళలాడిపోయేవి. ఆఖరికి పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేసేవారు. టికెట్ల కోసం అభిమానులు బట్టలు చింపేసుకునేవారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమాలు విడుదలైతే.. రిలీజ్ రోజు థియేటర్ల టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద పోలీసు బందోబస్తు ఉండాల్సిందే. కానీ కొద్ది రోజుల నుంచి అదంతా మారిపోయింది.
కానీ మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ప్రభాస్ పుణ్యమా అని మరోసారి ఆ సీన్ రిపీట్ అయింది. సలార్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నైజాంలో విడుదల చేస్తూ ఒక కొత్త ప్రయోగం చేశారు. అదేమిటంటే నైజాంలో అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్ లో కాకుండా కొన్ని ఎంపిక చేసిన థియేటర్ల వద్ద ముందుగా ఆఫ్‌లైన్ బుకింగ్ ఓపెన్ చేశారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న విశ్వనాథ్ 70 ఎంఎం,ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎం లాంటి థియేటర్ల వద్ద ‘సలార్’ టికెట్లు ఆఫ్లైన్లో బుకింగ్ కౌంటర్ల దగ్గర విక్రయించారు. కాగా, టికెట్ల కోసం ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకున్నారు.
టికెట్లు ఇచ్చే సమయానికి గేట్లు తెరవగా ఒక్కసారి అభిమానులు అందరూ పరుగులు పెట్టారు. దీంతో టికెట్ బుకింగ్ కౌంటర్స్ దగ్గర కుమ్ములాట జరిగింది. ఇక క్యూలైన్‌లో ఉన్న అభిమానులను కట్టడి చేయడానికి పోలీస్ కానిస్టేబుళ్లు తమ లాఠీలకు పని చెప్పారు. ఇదంతా చూస్తే ప్రభాస్ పుణ్యమా అని ఒకప్పుడు రోజులు గుర్తొచ్చాయి.
ఇక ప్రభాస్ మానియా కళ్ళకి కట్టినట్టు చూపించే ఈ వీడియోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను చూసి తమ డార్లింగ్ కి ఎంత ఫాలోయింగ్ ఉంది అని ప్రభాస్ అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా, రెండు భాగాలుగా రానున్న ‘సలార్’ మొదటి భాగం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook