Samantha: అంతులేని విషాదంలో సమంత.. అక్కినేని ఫ్యామిలీపై మండిపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..?
Samantha father joseph prabhu died: సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్విట్ పెట్టారు. దీంతో ఆమెకు బంధువులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున ధైర్యం చెబుతు కామెంట్లు చేస్తున్నారు.
Samantha father died news netizens emotional: సమంతకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పుకొవచ్చు. ఎన్నో ఆశలతో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది సమంత. అయితే.. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగిన కూడా అనుకొని విధంగా వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సామ్.. విడాకుల సమయంలో ఎంతో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తొంది. ఆతర్వాత అనూహ్యంగా మయోసైటిస్ కు గురైంది. దీంతో కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, ట్రీట్మెంట్ చేయించుకుంది. మరల వాటి నుంచి బైటపడి.. ఇటీవల సిటాడెల్ బన్నీ వెబ్ సిరిస్ తో అభిమానుల ముందుకు వచ్చింది.
అయితే.. ప్రస్తుతం సిటాడెల్ బన్నీ వెబ్ సిరిస్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. మరల సామ్.. తన పాత రోజులు గుర్తు చేసుకుని కొన్ని ఇంటర్వ్యూలలో ఎమోషనల్ అయ్యింది. డైవర్స్ తర్వాత తనను సెకండ్ హ్యాండ్.. యూజ్ డ్ అన్నారని బాధపడింది. అయిన వాటి నుంచి ఇప్పుడు దైర్యంగా మీముందుకు వచ్చి.. మరల కొత్త జీవితం స్టార్ట్ చేశానని చెప్పింది.
అయితే.. ఇటీవల సామ్ మాజీ భర్త.. చైతుకు శోభితతో పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. దీంతో సమంతా కొన్ని సందర్బాలలో ఇన్ డైరెక్ట్ గా తన మాజీ భర్తకు తను ఇచ్చిన గిఫ్ట్ లు వెస్ట్ అయ్యాయని కూడా మాట్లాడటం పెద్ద దుమారంగా మారింది. మరొవైపు సామ్.. దీపావళి వేడుకలను.. రాజస్థాన్ లో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా, సిటాడెల్ బన్నీ సక్సెస్ నేపథ్యంలో ప్రస్తుతం సెలబ్రేషన్స్ లో సామ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. ఒక్కసారిగా సామ్ కు మరో షాక్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయారని వార్తతో ఒక్కసారిగా ఆమె మరల తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
సోషల్ మీడియాలో హర్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేసిన మిస్ యూ.. డాడ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అయితే.. సామ్ తండ్రి మరణ వార్తతో ఆమె అభిమానులు సైతం.. ఒకింత షాక్ కు గురయ్యారంట. ఇప్పుడిప్పుడే.. బాధల్లో నుంచి బైటకు వస్తున్న సామ్ కు.. మరల ఆమె తండ్రి మరణ వార్త.. కోలుకోలేని దెబ్బగా చెప్తున్నారంట. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్కినేని కుటుంబం చైతు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
చైతు, శోభితల పెళ్లి.. డిసెంబరు 4న జరగనుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన మాజీ కోడలు తండ్రి చనిపోయారని వార్తను ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఎంత బిజీగా ఉన్న.. అక్కినేని ఫ్యామిలీలో ఏ ఒక్కరైన కనీసం.. డైరెక్ట్ గా మాట్లాడక పోయిన సోషల్ మీడియాలో అయిన సానుభూతి, సంతాపం వ్యక్తం చేయోచ్చు కదా అని నెటిజన్లు అక్కినేని కుటుంబంపై మండిపడుతున్నారంట.
అదే విధంగా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కనీసం నాగార్జున అయిన.. పెద్ద మనస్సుతో సామ్ పెట్టిన పోస్టుకు కనీసం రెస్పాండ్ అయితే.. ఆయనకు ఇది మరింత హుందాతనం ఇచ్చేది కదా అంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter