Akhil and Zainab ravdjee: ప్రస్తుతం అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతుండంతో అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ జోష్ గా ఉన్నారంట. ఈ క్రమంలో అక్కినేని అమల చేసిన పనిని సోషల్ మీడియా ఏకీపారేస్తున్నారు. మరికొందరు ఇదేం పని అంటు క్లాస్ పీకుతున్నారు.
శోభిత ధూళిపాళ,అక్కినేని నాగచైతన్యకు డిసెంబర్ 4న పెళ్లి జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి వేడుక రాత్రి 8.13 నిముషాలకు జరగనుంది.ఈరోజు వేడుకగా శోభిత హల్దీ కార్యక్రమం కూడా జరిగింది.
చైతు, శోభితలకు పసుపుతో మంగళ స్నానాల క్రతువు నిర్వహించారు. అంతే కాకుండా.. ప్రస్తుతం వీరి హల్దీ కార్యక్రమం వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇటీవల అమల చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ఇటీవల అక్కినేని అఖిల్, జైనబ్ ల ఎంగెజ్ మెంట్ జరిగింది. అయితే.. నాగార్జున తన సోషల్ మీడియాల అకౌంట్ లో చిన్న కొడుకు, చిన్న కోడలి ఎంగెజ్ మెంట్ పిక్స్ షేర్ చేసి స్పెషల్ గా విషేస్ చెప్పి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరారు,
గతంలో చైతు, శోబితాల ఎంగెజ్ మెంట్ ఆగస్ట్ 8 న జరిగినప్పుడు కూడా.. కింగ్ నాగార్జున ఇదే విధంగా చేశారు. కానీ నాగార్జున సతీమణి అమల మాత్రం.. చైతు ఎంగెజ్ మెంట్ అయినప్పుడు.. తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎలాంటి పోస్టులు చేయలేదు. కానీ అఖిల్ ఎంగెజ్ మెంట్ పిక్స్ మాత్రం సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిందంట.
ఈ క్రమంలో దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. రామానాయుడు కూతురుదగ్గుబాటి లక్ష్మీ.. నాగార్జున మొదటిభార్య.. వీరికి నాగచైతన్య జన్మించాడు. ఆ తర్వాత.. నాగార్జున మొదటి భార్యతో డైవర్స్ తీసుకుని.. అమలను చేసుకున్నాడు. అమలకు.. నాగార్జునకు.. అఖిల్ పుట్టాడు.
సాధారణంగా అఖిల్ అమల ఎక్కువగా చనువుగా కన్పిస్తుంటారు. కానీ అమలు, నాగచైతన్య కన్పించిన సందర్భాలు చాలా అరుదుగా అని చెప్పవచ్చంట. అయితే.. గతంలో చైతు సామ్.. తో విడిపోయేందుకు అమల కూడా కారణమని వార్తలు చక్కర్లు కొట్టాయి.
మళ్లీ ఇప్పుడు చైతు ఎంగెజ్ మెంట్ సమయంలో ఎలాంటి పోస్టులు చేయని , అమల.. అఖిల్, జైనబ్ ఎంగెజ్ మెంట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విష్ చేస్తే.. ఏమనుకొవాలని ఏకీపారేస్తున్నారంట. అంటే.. చైతు మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నావా.. అంటూ కొంత మంది కామెంట్లు సైతం పెడుతున్నారంట. శుభమా.. అని పెళ్లి జరుగుతుంటే.. ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారంట. మరీ దీంట్లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. మొత్తానికి ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో తెగ చర్చకు దారితీసిందని చెప్పుకొవచ్చు.