Samantha Post: సమంత. ఇప్పుడీ పేరు ఓ పెద్ద క్రేజ్. నాగచైతన్యతో విడాకులు, పుష్పలో ఐటెం సాంగ్‌తో మరింతగా పాపులరైంది. ఇప్పుడామె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆసక్తి కల్గిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో పుష్ప సినిమాలో ఊ అంటావా పాపకు చేసిన ఐటెం డ్యాన్స్ ఇంకా ఊపు తెచ్చింది. ఎక్కడ విన్నా సమంత చర్చ ప్రధానంగా కన్పిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆసక్తి రేపడమే కాకుండా ఆలోచింపజేస్తోంది. 


మహిళల్ని సెక్సువల్‌గా చూడవద్దని అంటే లైంగికంగా వేధించవద్దని మీ అబ్బాయిలకు నేర్పమంటోంది సమంతా ప్రభు. ఎంతసేపూ అమ్మాయిల్ని సెక్సువల్‌గా ఉండవద్దని చెప్పే బదులు..అమ్మాయిల్ని సెక్సువల్‌గా చూడటం లేదా అమ్మాయిల్ని లైంగికంగా వేధించడం చేయవద్దని అబ్బాయిలకు నేర్పమంటోంది సమంతా. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే మీ అమ్మాయిని సెక్సువల్‌గా ఉండవద్దని చెప్పడమంటే..అది ఆమెను కార్నర్ చేసినట్టేనని అంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫరీదా డి అనే మహిళ చేసిన ఈ పోస్ట్‌ను సమర్ధిస్తూ సమంతా క్వోట్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ స్వేచ్ఛగా కామెంట్లు చేసే సమంత పోస్టులు (Samantha Post) ఆలోచింపజేస్తుంటాయి. అందుకే ఆమె క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుంటోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ వైపు ప్రశంసలు మరోవైపు విమర్శలు రెండింటినీ ఎదుర్కొంటోంది. తనను విమర్శించేవాళ్లకు కూడా సమంతా ( Samantha) కూల్‌గానే సమాధానమిస్తోంది. ఇదే ఆమె ప్రత్యేకత. ఓ నెటిజన్ అయితే పరిధి దాటి కామెంట్ చేశాడు. సమంతా ఒక విడాకులు తీసుకున్న సెకండ్ హ్యాండ్ ఐటమ్ అని..ఓ జెంటిల్మన్ నుంచి 50 కోట్ల ట్యాక్స్‌లెస్ డబ్బులు తీసుకుందని ట్రోల్ చేశాడు. అయితే సమంత మాత్రం ఏ మాత్రం విసుగు చెందకుండా..గాడ్ బ్లెస్ యువర్ సోల్ అంటూ కామెంట్ చేసింది. 


Also read: Kajal Aggarwal Pregnant: గుడ్ న్యూస్ చెప్పిన గౌతమ్ కిచ్లు.. తల్లికాబోతున్న కాజల్ అగర్వాల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి