Samantha Ruth Prabhu Motivational Quote సమంతకు గత రెండేళ్లుగా టైం ఏమీ అంతగా కలిసి రావడం లేదు. నాగ చైతన్యతో సమంత విడిపోయిన తరువాత దారుణమైన విమర్శలను ఎదుర్కొంది. ఆ నెగెటివిటీని తట్టుకుంది, తన మీద జరిగిన విష ప్రచారానికి ఎదురు నిలబడింది.. వచ్చిన సమస్యలతో పోరాడింది. వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య పరమైన సవాళ్లను కూడా సమంత ఎదుర్కొంది. ఇలా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న సమంత తాజాగా ఓ కొటేషన్‌ను షేర్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కష్టాలను ఎదురిస్తే.. సుఖాలు వస్తాయి.. నిన్ను పరీక్షించే కాలం ఉంటుంది.. ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి.. ధైర్యంగా నిలబడి పరిష్కారం కనుక్కోవాల్సిన టైం వస్తుంది.. అవన్నీ దాటితేనే జీవితం సంపూర్ణం అవుతుంది.. మంటల్లో నడవాలి.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే గెలవాలి అనుకుంటావో.. అప్పుడే నీలో ఉన్న ఇంకో కోణం బయటకు వస్తుంది.. నీలో దాగి ఉన్న శక్తి బయటకు వస్తుంది.. 


Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?


అందుకే సమస్యలను చూసి పారిపోకండి.. పోరాడండి.. అలా కష్టాలకు ఎదురు నిలబడితేనే భవిష్యత్తులో సంతోషాలు, సుఖాలు దరికి చేరుతాయి అంటూ ఉన్న కొటేషన్‌ను సమంత షేర్ చేసింది. అంటే సమంత ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉందని, సమస్యలను తాను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను అని చెప్పకనే చెప్పినట్టుగా కనిపిస్తోంది.


[[{"fid":"274443","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక సమంత చివరగా శాకుంతలం సినిమాతో వచ్చింది. విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. శాకుంతలం సినిమాలో సమంత ఛార్మింగ్ కనిపించలేదని, రోగిష్టిదానిలానే కనిపించిందంటూ ట్రోలింగ్ జరిగింది. శాకుంతలం సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో సమంత ఆశలన్నీ విజయ్ దేవరకొండ ఖుషి సినిమా మీదే పెట్టేసుకుంది. ఇప్పుడు ఈ మూవీలోని సాంగ్‌ షూటింగ్ కోసం సమంత విదేశాలకు వెళ్లింది. మరో వైపు  సిటాడెల్ షూటింగ్‌తోనూ సమంత బిజీగానే ఉంది.


Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK