Senior actor Naresh comments about Sai Dharam Tej's bike accident: సాయి ధరమ్ తేజ్‌కు బైక్ యాక్సిడెంట్ గురించి సీనియర్ హీరో నరేశ్ చేసిన వ్యాఖ్యలు కొంత మంది సినీ ప్రముఖులను అసంతృప్తికి గురిచేసిన సంగతి తెలిసిందే. నరేష్ వ్యాఖ్యలపై నిర్మాతలు నట్టి కుమార్, బండ్ల గణేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీన్ మరో రకంగా మారుతోందని గ్రహించిన నరేశ్ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'' సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరగడం దురదృష్టకరం. నవీన్‌తో పాటు సాయితేజ్‌ను కూడా ఓ బిడ్డగానే భావిస్తాను కనుకే సాయితేజ్‌కి ప్రమాదం జరిగిందని తెలిసి కొంత ఆందోళనకు గురయ్యాను. మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచే చిరంజీవి కుటుంబంతో (Chiranjeevi family) మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడనే విషయాన్ని నాగబాబు (Nagababu) ద్వారా తెలుసుకున్నాకే రిలాక్స్‌గా అనిపించింది" అని నరేష్ తన వెర్షన్‌ను చెప్పుకొచ్చారు.


తాను కూడా గతంలో ఓసారి బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాను కనుకే ఎవరికైనా బైక్ రైడింగ్స్ వద్దని చెబుతుంటానని అన్నారు. సాయి ధరమ్ తేజ్, నవీన్ ఓ చాయ్ దుకాణం ఓపెనింగ్‌కు వెళ్లారని, వెళ్లిన పని పూర్తి చేసుకుని మళ్లీ ఎవరి ఇంటికి వాళ్లు తిరిగి బయల్దేరి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని నరేష్ (Actor Naresh) తెలిపారు.


Also read : Golden Hour: గోల్డెన్ అవర్ అతనికి ఓ వరం, అందుకే ప్రాణాపాయం తప్పింది


సాయి ధరమ్ తేజ్, నవీన్ మంచి బైక్ రైడర్లు. ఇద్దరూ బైక్స్ నడపడంలో దిట్టలు. బైక్ రైడింగ్ చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తారు. అయితే, సీసీ టీవీ ఫుటేజిని (Sai Dharam Tej bike accident CCTV footage) పరిశీలిస్తే.. సాయి ధరమ్ తేజ్ ఓ బైక్‌ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపై పేరుకుపోయిన మట్టిపై బైక్ వీల్స్ స్కిడ్ అవడంతో బైక్ అదుపు తప్పిపడినట్టు పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో సాయితేజ్ బైక్ స్పీడ్ 60-70 దాటలేదని పోలీసులు తెలిపారు అని చెబుతూ.. బైక్ అదుపు తప్పి పడటం వల్లే గాయాలయ్యాయే తప్ప, అక్కడేమీ రేసులు జరగలేదు.. అతనేమీ ర్యాష్‌ డ్రైవింగూ చేయలేదని నరేష్ పేర్కొన్నారు.


Also read : Sai dharam tej accident case CCTV video: సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు.. CCTV visuals ఆధారంగా కేసు దర్యాప్తు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook