Pushpa Trailer: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి కొత్త వివాదం రేపాడు. పవన్‌పై ఉన్న కోపాన్ని ఇంకోసారి ప్రదర్శించాడు. ఈసారి ఆర్జీవీ వ్యాఖ్యలు ఏకంగా చిరు కుటుంబంలోనే చిచ్చుపెట్టేలా ఉన్నాయా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లతో రాంగోపాల్ వర్మ(Ramgopal varma) ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. సినిమాలతో పాటు రాజకీయాలపై కూడా ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఎందుకో ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాడు. రాజకీయాల్లో చంద్రబాబుని, సినిమాల్లో పవన్ కళ్యాణ్‌ని ఎక్కువగా విమర్శించడం ఆర్జీవీకు అలవాటు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ట్రైలర్ నేపధ్యంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు  కొత్త వివాదాన్ని రేపుతున్నాయి. అల్లు అర్జున్‌లా చిరంజీవి, లేదా పవన్ కళ్యాణ్‌లు రియాలిస్టిక్ పాత్రలు చేయగలరా అంటూ సవాలు విసిరాడు ఆర్జీవీ. 


రెండ్రోజుల క్రితం అంటే డిసెంబర్ 6న విడుదలైన పుష్ప ట్రైలర్(Pushpa Trailer)బాగా ట్రెండ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో ఈ ట్రైలర్ విడుదల కాగా, హిందీలో 7వ తేదీన విడుదలైంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ పుష్ప హిందీ ట్రైలర్ విడుదల చేశాడు. పూర్తీ డీ గ్లామరైజ్డ్ లుక్‌లో అల్లు అర్జున్ మేనరిజం అన్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు సుకుమార్ టేకింగ్, క్యారక్టర్, విజువల్ ఎఫెక్స్ అన్నీ చర్చనీయాంశమయ్యాయి. ఈ ట్రైలర్‌పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. 


ఆర్జీవీ ఏమన్నాడంటే


రియలిస్టిక్ పాత్రలు చేయడానికి భయపడని ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). నేను సవాలు చేస్తున్నా..చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్ బాబుతో పాటు మిగిలిన ఎవరైనా ఇలాంటి పాత్రలు చేయగలరా. పుష్ప ఫ్లవర్ కాదు..ఫైర్ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ట్రైలర్ వంకతో మరోసారి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేశాడనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఓసారి అల్లు అర్జున్ ఎదుగుదల వెనుక చిరంజీవి ప్రమేయం లేదా తోడ్పాటు లేదని చెప్పడమే కాకుండా మెగా కుటుంబంలో నిజమైన సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమేనని ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ ట్రైలర్‌పై ఆర్జీవీ(RGV)చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. అసలు వర్మకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అంటే ఇంత కోపమెందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. 


Also read: Sara Tendulkar photos: సారా టెండుల్కర్ మోడలింగ్ ఎంట్రీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook