Shaakuntalam Collections vs Rudrudu Collections: యశోద సినిమా తర్వాత సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా మీద ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాత్రం సమంతకు ఏ మాత్రం ఊరట ఇవ్వలేకపోయింది. నిజానికి యశోద సినిమా ఒక మాదిరిగా హిట్ అయినా సరే కలెక్షన్స్ విషయంలో మాత్రం సమంత అనేక విమర్శలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందిన శకుంతల సినిమా కూడా మొదటి నుంచి డిజాస్టర్ ట్రాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గుణశేఖర్ స్వయంగా డైరెక్ట్ చేసి నిర్మించిన ఈ సినిమా మీద ముందు నుంచి ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు దిల్ రాజు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం ప్యాన్ ఇండియా లెవెల్ లో హిందీ,   తమిళ,   కన్నడ,   మలయాళ భాషల్లో సైతం రిలీజ్ చేయడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ కలెక్షన్స్ మాత్రం రోజురోజుకు ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. ఈ సినిమా ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల 37 లక్షల షేర్ నాలుగు కోట్ల 70 లక్షల వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల నాలుగు లక్షల షేర్ 8 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూలు చేసింది.


Also Read: Shaakuntalam vs Dasara: దారుణంగా 'శాకుంతలం'.. నాని సినిమా 20వ రోజు కలెక్షన్స్ క్రాస్ చేయలేక పోయిందిగా!


ఈ సినిమా బిజినెస్ ని బట్టి ఇంకా హిట్ అవ్వాలంటే 14 కోట్ల 96 లక్షలు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే రాఘవ లారెన్స్ హీరోగా రుద్రుడు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. తమిళ,   తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇది మాస్ మూవీ కావడంతో తెలుగు రాష్ట్రాల వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు 80 లక్షలు తర్వాత 53 లక్షలు,   57 లక్షలు,   28 లక్షల 5వ రోజు రకంగా 19 లక్షలు వసూలు చేసింది.


ఐదవ రోజు సమంత సినిమా 12 లక్షలు వసూలు చేస్తే తమిళ హీరో అయిన రాఘవ లారెన్స్ సినిమా 19 లక్షలు వసూలు చేయడం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదు రోజుల్లో రెండు కోట్ల 37 లక్షలు వసూలు చేసింది అంటే దాదాపుగా సమంత సినిమాతో సమానంగా ఈ సినిమా వసూలు చేసింది.


మరో దారుణమైన విషయం ఏమిటంటే ఈ సినిమా తమిళనాడులో ఐదు కోట్ల 60 లక్షలు గ్రాస్ వసూలు చేయగా కర్ణాటకలో 43 లక్షలు మిగతా భారతదేశంలో 18 లక్షలు,   ఓవర్సీస్ లో కోటి 22 లక్షలు మొత్తం కలిపి 11 కోట్ల 88 లక్షల గ్రాస్ 5 కోట్ల ఎనిమిది లక్షల షేర్ వసూలు చేసింది. ఒక రకంగా చూసుకుంటే ఇది సమంత సినిమా కంటే ఎక్కువ. అంటే సమంత సినిమాతో పాటు రిలీజ్ అయిన రుద్రుడు సినిమా సమంత సినిమాని బీట్ చేసి ముందుకు దూసుకుపోయింది అన్నమాట. ఈ దెబ్బతో సమంత మార్కెట్ కొలాప్స్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఈ అంశంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.
Also Read: Trishara then &now: 'సినిమా బండి'లో స్కూల్ పిల్ల ఇప్పుడు ఎలా తయారయిందో చూశారా? అరాచకం అంటే ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook