Jawan Advance Booking: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్(Jawan Movie) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'జవాన్'(Jawan). ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రేపు (సెప్టెంబరు 07)ను ప్రేక్షకుల ముందుకు రానుంది. పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జవాన్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్ కత్తా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో భారీగా ప్రీ బుకింగ్ సేల్స్ జరుగుతున్నాయి. జవాన్ రిలీజ్ కు ముందే రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ రూ.50 కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటికే ఇండియా వైడ్ గా అడ్వాన్స్ సేల్స్ రూ.32.47 కోట్లు,  ఓవర్సీస్ లో రూ.18.70 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మెుత్తంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.51.17 కోట్లును వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. పఠాన్ మూవీ రిలీజ్ కు ముందు రూ.32 కోట్ల వసూలు చేసింది. తాజాగా దీని రికార్డును జవాన్ బ్రేక్ చేసింది. 


ఈ చిత్రంలో షారుఖ్ కు జోడిగా నయనతార నటించగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటించాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె, దళపతి విజయ్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. ఇందులో ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ తదితరులు కీ రోల్స్ లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ట్వీట్ చేశాడు. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 



Also Read: Jawan Movie: 'మహేష్‌తో కలిసి జవాన్‌ సినిమా చూస్తా..': షారుఖ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook