Cheating Case On Shilpa Shetty: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty News), ఆమె భర్త రాజ్‌కుంద్రా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ముంబయికి చెందిన నితిన్​ బరాయ్​ అనే వ్యాపారవేత్త వీరిద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశాడు. దీనిపై శిల్పాశెట్టి స్పందిస్తూ.. తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని స్పష్టం చేసింది. తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుంటే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"కుంద్రా, నా మీద ఎఫ్​ఐఆర్​ రిజిస్టర్​ అయిందని తెలియగానే షాక్​ అయ్యాను. ఎస్​ఎఫ్​ఎల్​ ఫిట్​నెస్​ కంపెనీ బాధ్యతల్ని కాషిఫ్ చూసుకుంటున్నాడు. ఈ సంస్థకు చెందిన అన్ని డీల్స్​ అతడి వల్లే ఆగిపోయాయి. ఎలాంటి లావాదేవీలు గురించి మాకు తెలీదు. మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. గత 28ఏళ్లుగా నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. నా పేరును చెడగొడుతుంటే చాలా బాధేస్తుంది. చట్టాన్ని గౌరవించి జీవిస్తున్న భారత పౌరురాలిగా.. నా హక్కులను కాపాడండి" అని శిల్పాశెట్టి ఆవేదనకు గురైంది.


ఏం జరిగిందంటే?


శిల్పాశెట్టి దంపతులు తనని మోసం చేశారంటూ నవంబరు 14న ముంబయికి చెందిన వ్యాపారవేత్త నితిన్‌ పోలీసులను ఆశ్రయించాడు. తమ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ 2014లో ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఫిట్‌నెస్‌ కంపెనీ డైరెక్టర్‌ కాషిఫ్‌ ఖాన్‌, శిల్పా, రాజ్‌కుంద్రా కోరారని.. అలా చేస్తే పుణెలో ఎస్‌ఎఫ్‌ఎల్‌ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు తనకు అవకాశం ఇస్తామని వాళ్లు మాటిచ్చారని చెప్పాడు. దాంతో తాను రూ. 1.5 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు నితిన్‌ తెలిపాడు.


అయితే, ఇన్ని సంవత్సరాలైనప్పటికీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ బ్రాంచ్‌లు కార్యరూపం దాల్చకపోవడం వల్ల విసిగిపోయిన తాను.. డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని కోరగా.. వాళ్లు తనని బెదిరిస్తున్నారంటూ అతడు బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నితిన్‌ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శిల్పాశెట్టి దంపతులతోపాటు ఎస్‌ఎఫ్‌ఎల్‌ సంస్థకు చెందిన పలువురు వ్యక్తులపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.


Also Read: Attack on Shalu Chourasia: 'ఓ పిల్లా నీ వల్ల' సినిమాలో నటించిన హీరోయిన్ పై దాడి..


Also Read: Ghani Movie Teaser: మెగా పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో.. వరుణ్ తేజ్ ‘గని’ టీజర్ వచ్చేసింది  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook