Sree Leela Latest Movies: తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటిదాకా సీక్రెట్ గా ఉంచిన ఒక విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తన సినిమా భగవాంత్ కేసరిలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపిస్తున్న శ్రీలీల సినిమాల్లోకి రాక ముందు నుంచే అనిల్ రావిపూడికి బాగా తెలుసట. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న ఒక బంధం అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. అనిల్ రావిపూడి, శ్రీలీల వాళ్ళ అమ్మగారు డాక్టర్ స్వర్ణ ఇద్దరు ఒంగోలు దగ్గర్లోని పొంగులూరు అనే గ్రామానికి చెందినవారు. శ్రీలీల పెరిగింది బెంగుళూరు, అమెరికాలో అయినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం తన అమ్మమ్మ దగ్గరికి వెళుతూ ఉండేదట. ఇక శ్రీలీల వాళ్ళ అమ్మగారు అనిల్ రావిపూడికి స్వయానా అక్క వరుస అవుతారట. అంటే శ్రీలీల అనిల్ రావిపూడికి అక్క కూతురు అన్నమాట.


అయితే షూటింగ్ సెట్స్ లో మాత్రం శ్రీలీల, అనిల్ రావిపూడి ఈ విషయాన్ని చాలా వరకు దాచిపెట్టారట. షూటింగ్ జరుగుతున్నంత సేపు సెట్స్ మీద శ్రీలీల అనిల్ రావిపూడిని డైరెక్టర్ గారు అని మాత్రమే పిలుచేది కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళ ముందు మాత్రం అనిల్ రావిపూడిని మామ అని పిలుస్తుందట. అలా తన చుట్టాలమ్మాయితో అనిల్ రావిపూడి సినిమా చేసేశారు. 


ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే.. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల బాలయ్య కూతురి పాత్రలో కనిపిస్తోంది. ట్రైలర్ తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో బాలకృష్ణ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి. 


షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. బాల ఇంతవరకు ఎన్నడు కనిపించినటువంటి పాత్రలో బాలయ్య ఇందులో కనిపిస్తారని అనిల్ రావిపూడి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.


Also read: Bathukamma: బతుకమ్మ ఏర్పాట్లపై ఎమ్మెల్యే మాధవరం అసంతృప్తి


Also Read: OnePlus Open: వన్‌ప్లస్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, లాంచ్ ఎప్పుడు, ఫీచర్లు, ధర


Also Read: Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..