OnePlus Open: వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. దసరా పురస్కరించుకుని ఇండియాలో వన్‌ప్లస్ ఓపెన్ అక్టోబర్ 19న లాంచ్ కానుంది. వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో కూడా కొన్ని వివరాలు లీకయ్యాయి.
ఇండియాలోనూ, ప్రపంచ మార్కెట్‌లోనూ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు క్రేజ్ ఎక్కువ. ఇప్పుడీ కంపెనీ మార్కెట్‌లో కొత్తగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తోంది. అక్టోబర్ 19న ఇండియాలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ కంపెనీకు ఇదే మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. ప్రస్తుతానికి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాంసంగ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వచ్చేవారం నుంచి వన్‌ప్లస్ కంపెనీ పోటీ ఇవ్వనుంది.
వన్‌ప్లస్ ఓపెన్ ఎలా ఉంటుందంటే
వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ చాలా తేలిగ్గా ఉండటమే కాకుండా చాలా స్లిమ్‌గా డిజైన్ చేసి ఉంటుంది. స్క్రీన్‌పై ఏ విధమైన లైన్స్ ఉండవు. ఈ ఫోన్ కెమేరా సామర్ధ్యం కూడా మిగిలినవాటితో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వవచ్చు. ఇక వన్‌ప్లస్ ఓపెన్ ధర ఇండియాలో 1,41,490 రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
వన్‌ప్లస్ ఓపెన్ ఫీచర్లు
వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి లాంచ్‌కు ముందే చాలా ఫీచర్లు లీకయ్యాయి. ఇందులో 7.8 ఇంచెస్ స్క్రీన్ ఉండి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అవుటర్ డిస్‌ప్లే 6.3 ఇంచెస్ ఉంటుంది. ఇక ప్రోసెసర్ గురించి పరిశీలిస్తే..ఇందులో క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ 2 చిప్‌సెట్ ఉంటాయి. ఇది 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎలర్ట్ స్లైడర్ కూడా ఉంటుందని కంపెనీ విడుదల చేసిన టీజర్ ద్వారా తెలిసింది.
Also read: Online General Tickets: ఇకపై ఆన్‌లైన్‌లో కూడా రైల్వే జనరల్ టికెట్లు , బుకింగ్ ఎలా చేయాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook