Shyam Singha Roy Review: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీలో నాని..  వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్‌ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి వస్తున్న నాని సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని ఏమేరకు ఆకట్టుకున్నాయి? మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.


సూపర్ హిట్ అందుకున్నాడా?


కరోనా సంక్షోభం కారణంగా నాని నటించిన రెండు చిత్రాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన 'వి', 'టక్ జగదీష్' సినిమాలు మంచి టాక్ సంపాదించుకోగా.. ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి సూపర్ హిట్ అందుకోవడానికి నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 


తాజాగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ మంచి టాక్ సంపాదించుకుంది. నాని, సాయి పల్లవి జోడి ఈ సినిమాలో హైలేట్ అని.. బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్ సీన్స్ కూడా సినిమాకు మరో హైలెట్ అంటున్నారు. ఈ సినిమాతో నాని సూపర్ హిట్ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నారు.





మరోవైపు రెండు విభిన్న పాత్రలో నాని ఒదిగిపోయాడని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అయిందట. సినిమాలోని మొదటి భాగం కొంచెం స్లోగా ఉందని, క్లైమాక్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. రెండేళ్ల తర్వాత థియేటర్‌లోకి వచ్చిన నాని.. హిట్‌ కొట్టాడని ఎక్కువ మంది కామెంట్‌ చేశారు.  



 


Also Read: Sushmita Sen Breakup: 'మా బంధం ముగిసింది': రోహ్మన్ తో బ్రేకప్ పై మాజీ విశ్వసుందరి క్లారిటీ


Also Read: Nora Fatehi Car Accident: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కారుకు ప్రమాదం.. నటి పరిస్థితి ఎలా ఉందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి