Nora Fatehi Car Accident: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కారుకు ప్రమాదం.. నటి పరిస్థితి ఎలా ఉందంటే?

Nora Fatehi Car Accident: 'బాహుబలి' సినిమాలోని ఐటెంసాంగ్ లో నటించిన బాలీవుడ్ నటి నోరా ఫతేహి కారు ప్రమాదానికి గురైంది. నోరా కారు ముంబయిలోని ఓ ఆటోను ఢీ కొనగా.. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదని తెలుస్తోంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 04:21 PM IST
Nora Fatehi Car Accident: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కారుకు ప్రమాదం.. నటి పరిస్థితి ఎలా ఉందంటే?

Nora Fatehi Car Accident: బాలీవుడ్ ఐటెంసాంగ్స్ క్వీన్ నోరా ఫతేహి కారు ప్రమాదానికి గురైంది. ముంబయిలోని ఓ ప్రాంతంలో ఆమె కారు.. ఓ ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగే సమయంలో నోరా ఫతేహి కారులో లేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదని తెలుస్తోంది.  

ఏం జరిగిందంటే?

డిసెంబరు 21న రాత్రి ఓ ప్రమోషనల్​ ఈవెంట్​లో పాల్గొనేందుకు నోరా ఫతేహి, మ్యూజిక్ డైరెక్టర్ గురు రంద్వా కారులో వెళ్లారు. ఆ తర్వాత డ్రైవర్​ ఒక్కడే ఉన్న సమయంలో కారుతో బయటకు వచ్చాడు. ఆ సమయంలో నోరా ఫతేహి కారు ఓ ఆటోను ఢీకొంది. 

అయితే ఈ ప్రమాదంలో ఆటోతో పాటు నోరా ఫతేహి కారు కూడా పాక్షికంగా దెబ్బతింది. అందుకు కారణమైన కారు డ్రైవర్ ను స్థానికులు నిలదీశారు. దాంతో నోరా ఫతేహి వచ్చి.. ఆ ఆటో డ్రైవర్ కు రూ.1000 ఇచ్చి సెటిల్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 

తెలుగు, హిందీ సినిమాల్లోని పలు స్పెషల్ సాంగ్​ల్లో నర్తించిన నోరా ఫతేహి.. ఇటీవలే కొన్ని సరికొత్త పాటలతో ఫ్యాన్స్ ను అలరించింది. 'సత్యమేవ జయతే 2' చిత్రంలో 'కుసు కుసు' సాంగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత గురు రంద్వాతో కలిసి 'డ్యాన్స్ మేరీ రాణి' సాంగ్ తో శ్రోతల్ని అలరిస్తుంది.   

Also Read: Dhanush Telugu movie: టాలీవుడ్​లోకి ధనుష్ 'సార్​' ఎంట్రీ ఇస్తున్నారు- త్వరలోనే షూటింగ్​ షురూ..

Also Read: AP Movie Ticket Issue: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News