Sushmita Sen Breakup: బాలీవుడ్ లవ్ బర్డ్స్ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్, మోడల్ రోహ్మన్ షాల్ విడిపోనున్నారు. ఇదే విషయమై కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది సుస్మితా సేన్. రోహ్మన్ తో తన బంధం ముగిసిందని సోషల్ మీడియాలో ప్రకటించింది.
"మా ప్రయాణాన్ని స్నేహంతో ప్రారంభించాం. ఇప్పుడు స్నేహితులుగానే విడిపోతున్నాం. మా ఇద్దరి మధ్య అనుబంధం ముగిసింది. కానీ, ప్రేమ అలానే ఉంది" అని సుస్మితాసేన్ పేర్కొంది.
కొన్ని జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. సుస్మితా సేన్ తో బ్రేకప్ తర్వాత ఆమె నుంచి రోహ్మన్ షాల్ వెళ్లినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం అతడు తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడని వెల్లడించాయి.
గత నెల, సుస్మితా సేన్ పుట్టినరోజున ఆమెతో ఉన్న త్రోబాక్ ఫొటోను రోహ్మాన్ షాల్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫొటోకు "హ్యాపీ బర్త్ డే బాబూష్" అని రెండు హార్ట్స్, హగ్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. అప్పటి నుంచే వీరిద్దరూ విడిపోయారని జోరుగా ప్రచారం జరిగింది.
సుస్మితా, రోహ్మాన్ సోషల్ మీడియా వేదికగా 2018లో పరిచయమయ్యారు. ఆ స్నేహం కాస్తా రిలేషన్‌షిప్‌కి దారితీసింది. తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మాన్ను ఎంతగానో ఆరాధించే సుస్మిత ఈ నిర్ణయం తీసుకోవటంపై పలువురు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Radhe ShyamTrailer: ప్రేమ, పెళ్లి లేవంటున్న ప్రభాస్..'రాధేశ్యామ్' ట్రైలర్ అదుర్స్..
Also Read: Jadeja pushpa video: పుష్ప డైలాగ్ తో అదరగొట్టిన 'రవీంద్ర జడేజా'...సూపర్ అంటూ బన్నీ కామెంట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి