Chithha Movie Teaser out: సిద్ధార్థ్‌ (Siddarth) నయా మూవీ 'చిత్తా'(Chithha). సేతుప‌తి (Sethupathy) సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ (Arun Kumar) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంట‌ర్‌టైన‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆడియెన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కూతురు కోసం తండ్రి చేసే పోరాటంగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్ షురూ చేయనున్నారు చిత్రబృందం. 


Also Read: Jawan Movie Review: షారుక్ 'జవాన్' సినిమా హిట్టా? ఫట్టా?


బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటాన, ఓయ్ వటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన నటుడు సిద్ధార్థ్. బొమ్మరిల్లు సినిమాలో ఈయన నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ ఉండరు. గత కొన్నేళ్లుగా సిద్దార్థ్ కు సరైన హిట్ లేదు. రీసెంట్ గా టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. కోలీవుడ్ తోపాటు తెలుగులో సమానమైన మార్కెట్ ఉన్న నటుల్లో సిద్దార్థ్ కూడా ఒకరు. సిద్దార్థ్ చిత్తా మూవీ ద్వారానైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. 



Also Read: Jailer In OTT: ఓటీటీలోకి వచ్చేసిన రజినీకాంత్ 'జైలర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook