SIIMA 2022 Telugu Winners List: గత్తర లేపిన పుష్ప.. తగ్గేదేలే అంటూ అవార్డుల వేట!
SIIMA 2022 Telugu Movie Winners Full List: సైమా అవార్డులలో పుష్ప సినిమా సత్తా చాటింది. మొత్తం 12 క్యాటగిరీలలో నామినేట్ అవ్వగా అందులో సగం అంటే 6 కేటగిరీలలో అవార్డులు కూడా సంపాదించింది.
SIIMA 2022 Telugu Movie Winners Full List: Pushpa Clean Sweap: కేవలం దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన సినిమాలు ఆయా సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్ల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ దీనికి సంబంధించిన పదో సీజన్ అవార్డుల ప్రధానోత్సవం రెండు రోజులు పాటు బెంగళూరులో ఘనంగా జరిగింది. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో తెలుగు, కన్నడ పరిశ్రమకు సంబంధించిన అవార్డులు ప్రకటించారు.
ఇక ఈ అవార్డులలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా అనేక అవార్డులను సంపాదించింది. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన్న హీరోయిన్ గ మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన ఈ సినిమా మొత్తం 12 క్యాటగిరీలలో నామినేట్ అవ్వగా అందులో సగం అంటే 6 కేటగిరీలలో అవార్డులు కూడా సంపాదించింది. బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ లిరిక్ రైటర్ వంటి విభాగాలలో ఈ సినిమాకి అవార్డులు అందాయి.
ఇక తెలుగు విషయానికి వస్తే సైమా అవార్డులు అందుకున్న వారి పూర్తి వివరాలు ఈ మేరకు ఉన్నాయి. బెస్ట్ మూవీగా పుష్ప సినిమా నిలిస్తే బెస్ట్ డైరెక్టర్ గా పుష్ప మూవీ డైరెక్ట్ చేసిన సుకుమార్ నిలిచారు. అలాగే బెస్ట్ యాక్టర్ గా పుష్ప సినిమాలో అల్లు అర్జున్, బెస్ట్ హీరోయిన్ గా మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్ పూజా హెగ్డే నిలిచారు. ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా పుష్ప సినిమాలో నటించిన జగదీష్ ప్రతాప్ బండారి(కేశవా) నిలిచారు. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా క్రాక్ సినిమాలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ నిలిచారు.
ఇక బెస్ట్ సంగీత దర్శకుడిగా పుష్ప సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ నిలువగా బెస్ట్ లిరిక్ రైటర్ గా పుష్పలోని శ్రీవల్లి పాట రాసిన చంద్రబోస్ ఉంచారు. ఇక బెస్ట్ సింగర్ గా జాతి రత్నాలలో సాంగ్ పాడిన రామ్ మిలియాల నిలిచారు. బెస్ట్ గాయనిగా అఖండ మూవీకి గాను గీతామాధురి నిలిచింది. బెస్ట్ నటుడు క్రిటిక్స్ కేటగిరీలో జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి నిలిస్తే బెస్ట్ డెబ్యూ హీరోగా ఉప్పెన సినిమాకి గాను వైష్ణవ్ తేజ్ నిలిచారు.
అలాగే బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కృతి శెట్టి ఉప్పెన సినిమాకి గాను అవార్డు అందుకున్నారు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, బెస్ట్ నూతన నిర్మాతగా నాంది మూవీ నిర్మాత సతీష్ వేగ్నేశ నిలిచారు. అలాగే బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా అఖండ మూవీకి శ్రీ రాంప్రసాద్ అవార్డు అందుకోగా బెస్ట్ కమెడియన్ గా ఏక్ మినీ కధ సినిమాకి గాను సుదర్శన్ నిలిచారు.
Also Read: Krishnam Raju Funeral Live Updates: చివరి నిముషంలో మారిన అంత్యక్రియల స్థలం.. ఎంతో ఇష్టమైన చోటే!
Also Read: Krishnam Raju Funeral: చివరి నిముషంలో మారిన కృష్ణంరాజు అంత్యక్రియల స్థలం.. ఎందుకు మార్చారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి