Mrunal Thakur Bad Phase in Career సీతారామం సినిమాతో సౌత్ ఆడియెన్స్‌ను మెప్పించింది మృణాల్ ఠాకూర్. అంతకు ముందు హిందీ సీరియల్స్, బాలీవుడ్ సినిమాలతో అదరగొట్టేసింది. తన కెరీర్ ప్రారంభంలో మృణాల్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయితే తాజాగా మృణాల్ తన గతాన్ని తాను గుర్తు చేసుకుని బాధపడినట్టుగా అనిపిస్తోంది. ఆమె వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్న అంతా కూడా నాకు ఎంతో కష్టంగా, బాధగా గడిచింది.. కానీ ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాను.. మరింత శక్తివంతంగా మారాను. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి.. వాటిని బయటకు గట్టిగా చెప్పుకోలేరు.. కానీ నేను మాత్రం వాటిని కూడా బయటకు చెబుతాను..  ఎందుకంటే వాటిని తెలుసుకుని గుణపాఠంగా మార్చుకుని కొంతమందైనా మారుతారేమోనని. అనుభవం లేక మోసపోవడం, నేర్చుకోవడం తప్పేమీ కాదేమో అంటూ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయింది. 


ఇందులో చూస్తుంటే మృణాల్ ఏడుస్తున్నట్టుగా కనిపించింది. ఆ తరువాత మళ్లీ వెంటనే మరో పోస్ట్ వేసింది. తాను అంతలా ఎందుకు బాధపడుతున్నానని, ఆ ఫోటోలో ఎందుకు కనిపించాను అని, తన మెంటల్ హెల్త్ గురించి చెప్పింది మృణాల్. అది పాత ఫోటో అని, అప్పుడు చెప్పుకోలేకపోయాను అని, ఇప్పుడు బయటకు చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది.


మృణాల్ ఠాకూర్ చేతిలో ఇప్పుడు మంచి ప్రాజెక్టులే ఉన్నాయి.ఆమె సైతం వచ్చిన క్రేజ్‌ను వాడుకోవాలని చూసుకోవడం లేదు. నచ్చిన కథలను ఎంచుకుంటూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. సీతారామం తరువాత ఇంత వరకు ఒక్క తెలుగు సినిమాను కూడా అధికారికంగా ప్రకటించలేదు. నానితో మృణాల్ ఓ సినిమా చేయబోతోందనే టాక్ మాత్రం బయటకు వచ్చింది.


Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?


Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook