Naga Chaitanya: నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని కొంతకాలం.. సంతోషంగా జీవించారు. ఈ ఇద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉంది అని సినీ ఇండస్ట్రీ మొత్తం టాక్ ఉండేది. ఇటు అక్కినేని కుటుంబం కూడా సమంతను.. తమ సొంత కూతురిలా చూసుకుంటుంది..అని అందరూ భావించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో సమంతపై.. తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అందరూ నాగచైతన్యను సమర్థిస్తూ.. సమంతను తిట్టిపోశారు. అయితే దీని వెనుక ఓ పెద్ద ప్లానింగ్ ఉంది అన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత అప్పట్లో పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడం, ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో నటించడం తీవ్ర సంచలనాన్ని రేపాయి. ఓ రకంగా చైతన్య.. సమంతకు దూరం కావడానికి ఇవే కారణాలు అన్న కథనాలు ఇంటర్నెట్లో ఎన్నో వచ్చాయి. అయితే మరోపక్క.. నాగచైతన్య, శోభిత ధూళిపాలతో ప్రేమాయణం నడుపుతున్నాడు అని పుకార్లు వచ్చినా ఎవ్వరు పట్టించుకోలేదు. ఓ రకంగా సమంత.. నాగచైతన్య కి దూరం కావడానికి శోభిత కారణం అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా గుడ్డిగా నాగచైతన్య.. తప్పు ఏమీ లేదు.. అంత సమంత తప్పే.. అని ఎంతోమంది మాట్లాడుతూ వచ్చారు. అయితే అలా మాట్లాడిన వారు ఇప్పుడు షాక్ అవుతున్నారు. 


సడన్ గా తెరపైకి వచ్చిన నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్.. అప్పటి రూమర్స్ కి బలాన్ని చేకూరుస్తోంది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సమంత పై సింపతీ పెరిగిపోయింది. హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసుకొని.. తన సంతోషాన్ని వెల్లడించారు. కానీ కొత్త దంపతులను అభినందించాల్సిన నెటిజెన్లు ఒక్కసారి భగ్గుమన్నారు. 


ఒకప్పుడు నాగార్జున కూడా ఇదే రకంగా.. అమలను పెళ్లి చేసుకోవడం కోసం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలా ఎన్నో సంవత్సరాలు తల్లిదగ్గర ఒంటరిగా.. పెరిగిన నాగచైతన్య ఇప్పుడు సమంత అనుభవిస్తున్న కష్టాన్ని ఎందుకు గుర్తించలేకపోయాడు అర్థం కావడం లేదని.. కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇద్దరు భార్యలు సరే.. మూడో భార్య ఎవరు కూడా చెప్పాలి అంటూ పోస్టులు పెట్టేస్తున్నాడు. 


సమంతా అభిమానులు ఆమెకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. మరికొందరు ఇంతకీ ఏమిటో ఎన్ని సంవత్సరాలు ఉంటారో.. ముందే చెప్పేస్తే మేము సైలెంట్ గా ఉంటాము అని నాగచైతన్యను సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తున్నారు. కాగా నాగచైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ కి గురి అయిన సమంత ఆ తరువాత అనారోగ్యంతో ఎంతో పోరాడింది. అప్పుడు ఆమెని అర్థం చేసుకొని వారు కూడా ఇప్పుడు ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నారు. ఈ ఇద్దరి మోసం కారణంగా సమంత హార్ట్ బ్రేక్ అయి ఉంటుందని దుమ్మెత్తి పోస్తున్నారు.


 



Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్‌ వివేకా హత్యపై కీలక పరిణామం


Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇకపై ఆ నిబంధన ఉండదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి