Sonu Sood: ముంబైకి 5,500 తో వచ్చాను
వలసకార్మికులతో పాటు కరోనావైరస్ ( CoronaVirus ) వల్ల కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా మారిన సోనూసూద్ ( Sonu Sood ) తన గతం గురించి చెప్పాడు.
వలసకార్మికులతో పాటు కరోనావైరస్ ( CoronaVirus ) వల్ల కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా మారిన సోనూసూద్ ( Sonu Sood ) తన గతం గురించి చెప్పాడు. ఇప్పడంటే సోనూ సూద్ దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి కానీ.. తను ముంబైకి వచ్చినప్పుడు మాత్రం తన చేసిలో కేవలం రూ.5,500 మాత్రమే ఉన్నాయని తను పడ్డ కష్టాల గురించి తెలిపాడు. తను ఇంజినీర్ అని..గ్రాడ్యుయేషన్ తరువాత ఇంటికి వెళ్లి కుటుంబంతో కలిసి ఏదైనా వ్యాపారం ( Family Business ) స్టార్ట్ చేద్దాం అనుకున్నాడట. కానీ మళ్లీ ముంబైకి వెళ్లాలనే ఆశ మాత్రం మదిలో ఉండేది అని తెలిపాడు. ఇంట్లో వాళ్లు ఆపుతారేమో అనుకున్నాట. కానీ తల్లిదండ్రులు తన కలలను నెరవేరేందుకు ప్రోత్సాహించారని వివరించాడు.
అలా చేతిలో రూ.5,500 పెట్టుకుని ముంబైలో ( Mumbai ) అడుగుపెట్టిన సోనూసూద్ ను ఫిలింసిటీ (Film City) గేటు వద్దే ఆపారట. దాంతో రూ.400 ఎంట్రీ ఫీజు తీసుకుని లోపలికి వెళ్లాను అని.. తనను ఎవరైనా చూసి ఒక్క ఛాన్స్ ఇస్తారేమో అనుకున్నాడని తెలిపాడు. కానీ అలా ఎప్పడూ జరగలేదు అని..నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే అది తల్లిదండ్రుల ఆశీర్వాదమేఅన్నాడు సోనూ.
Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారు