WHO: రష్యా వ్యాక్సిన్ పనితీరుపై సందేహాలు

కరోనావైరస్ ( Coronavirus) టీకా కనుక్కున్నామని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చిన రష్యాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO ) షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 ( Covid-19) వ్యాక్సిన్ తయారీలో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న తొమ్మిది టీకాల్లో రష్యా కనుక్కున్న వ్యాక్సిన్ పేరు లేదని తెలిపింది.

Last Updated : Aug 14, 2020, 12:53 PM IST
    1. రష్యా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సందేహాలు
    2. తమ వద్ద సమాచారం లేదని వ్యాఖ్యాలు
    3. టాప్ 9లో స్పూత్నిక్ వి లేదన్న WHO
WHO: రష్యా వ్యాక్సిన్ పనితీరుపై సందేహాలు

కరోనావైరస్ ( Coronavirus) టీకా కనుక్కున్నామని ప్రకటించి ప్రపంచానికి షాకిచ్చిన రష్యాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO ) షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 ( Covid-19) వ్యాక్సిన్ తయారీలో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న తొమ్మిది టీకాల్లో రష్యా కనుక్కున్న వ్యాక్సిన్ పేరు లేదని తెలిపింది. టెస్టింగ్ స్టేజ్ లోనే టీకాల కోసం అగ్రీమెంట్స్ చేసుకోవడానికి, పెట్టుబడుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation ) తొమ్మిది వ్యాక్సీన్ లకు గుర్తింపు ఉన్నట్టు ప్రకటించింది. కాగా రష్యా తయారు చేసిన స్పూత్నిక్ వి అనే వ్యాక్సిన్ గురించి తమ వద్ద అంత సమాచారం లేదు అని తెలిపింది.

రష్యా టీకా పని తీరు గురించి, దాని సమర్థత గురించి నిర్ణయానికి రావడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అడ్వైజర్ డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ తెలిపారు. అయితే ప్రస్తుతం రష్యా వ్యాక్సిన్ ఏ స్టేజీలో ఉందో తెలుసుకోవడానికి రష్యాను సమాచారం కోరుతున్నాం అన్నారు. స్పూత్నిక్ వి (Sputnik V) ని ఎంత మందిపై ప్రయోగించారు. దాని ఫలితాలు ఎలా ఉన్నాయి.. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో నిర్ధారణకు రావాల్సి ఉంది అన్నారు.

Trending News