Real Hero Sonu Sood: అరుంధతి,  దూకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు సోనూ సూద్ ( Sonu Sood ). నటుడిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేసినా.. నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ చాలా మంది జీవితంలో హీరో పాత్ర పోషించాడు. లాక్డౌన్ ( LockDown ) సందర్భంలో ఎంతో మంది సొంత గ్రామాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతోంటే వారికి బస్సులు ఏర్పాటు చేసి సొంత గూటికి పంపించాడు. ప్రతీ వలస కార్మికుడు తమ ఇంటికి చేరే వరకు ఆగేది లేదు అనే సంకల్పంతో రంగంలోకి దూకాడు ఈ రియల్ హీరో. ( శ్రీ రాపాకా స్వీటి ఘాటు అందాల హాటు ఫోటోలు )



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వలస కార్మికుల విషయంలోనే కాదు.. సమస్యల్లో ఉన్న ఎవరైనా సహాయం అడిగితే.. కాదు.. లేదు అనకుండా వెంటనే చేసి పెట్టడం సోనూ సూద్ స్పెషాలిటీ...అలా సహాయం అడిగిన ఒక చిన్నారికి ఇక మీ ఇంటిపైకప్పు నుంచి ఇక నీరు కారదు అని చెప్పి చూపించాడు సోనూ సూద్.



ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబానికి సాయం చేసి మళ్లీ తన గొప్పతనం చాటుకున్నాడు సోనూసూద్.



ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కూడా సోనూ సూద్ చేసిన మంచిపనిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తన వంతుగా రైతు కుటుంబానికి సహాయం చేస్తానన్నారు నారా చంద్రబాబు నాయుడు.



ఎవరు సాయం అడిగినా యస్ అని వెంటనే చేసి చూపించడం సోనూ సూద్ ప్రత్యేకత. ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన సోనూ సూద్... ముంబై లోని తన హోటల్ మొత్తం కరోనావైరస్ ( Coronavirus ) సోకిన పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించే వైద్యులు, సిబ్బందికి కేటాయించాడు. వలస కార్మికులు తమ ఇంటికి వెళ్లేలా చేయడమే కాదు.. వారికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ రియల్ హీరో ( #RealHeroSonuSood) . ప్రస్తుతం మరో మిషన్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు సోనూ సూద్.



 



Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?


Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే