International Indian Film Festival Toronto: తమిళం, తెలుగులో గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఖైదీ’( Khaidi ) చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో హీరో కార్తీ ( Karthi ) మంచి పర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే.. కెనడాలో ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ టోరంటోలో దీనిని ప్రదర్శించనున్నారు. అయితే.. 2019 సంవత్సరానికి గాను ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఖైదీ చిత్రం ఎంపికైందని.. ఆగస్టు 12న దీనిని ప్రదర్శిస్తారని ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఈ చిత్రం కోసం పనిచేసిన వారందరికీ బిగ్ థ్యాంక్స్ అంటూ ట్విట్టర్‌లో రాశారు. Also read: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఖైదీ’లో కార్తీ, నరేన్, అర్జున్ దాస్, జార్జ్ మరియన్, ధీనా కీలక పాత్రల్లో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో దీనిని ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు.


ఈ చిత్రంలో కార్తీ అద్భుతమైన నటనతో అటు తమిళంలో ఇటు తెలుగులో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అనుక్షణం ఉత్కంఠతో సాగే విధంగా ఈ సినిమాను కనగరాజ్ తెరకెక్కించారు. ఢిల్లీ (కార్తీ) పదేళ్ల శిక్ష అనంతరం జైలు నుంచి విడుదలై మొదట తన కుమార్తెను చూసేందుకు ఆసక్తితో ఉంటాడు. అప్పుడే ఓ పోలీసును రౌడీ గ్యాంగ్ నుంచి కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులను, కూతరును కలిసేందుకు తండ్రి పడుతున్న ఆవేదనను కనగరాజ్ బిగ్‌స్క్రీన్‌పై అద్భుతంగా చూపించారు. సుశాంత్‌ను రియా చక్రవర్తి వేధించింది: అంకితా లోఖాండే