Vaaradhi update: 
తెలుగు తెరపైకి మరొక కొత్త యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న.. వారధి చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసిన.. సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సినిమా కథ చాలా బాగుందని.. ప్రేమ, భావద్వేగాలతో నిండి తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది అని ప్రశంసించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై.. నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా రూపొందించారు. వారధి చిత్రం కథ ప్రేమ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాలను కలిపి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి రూపొందించబడింది. చిత్రంలో హీరోగా అనిల్ అర్కా, హీరోయిన్గా విహారికా చౌదరి నటించారు. 


ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ, "ఈ సినిమా కథ యూత్‌ను ఆకర్షించేలా ఉంటుంది. ప్రేమ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా నచ్చుకుంటారని నాకు నమ్మకం ఉంది," అని చెప్పారు. 
Also Read: Lagacharla Farmer: తెలంగాణ పోలీసులు మరో దారుణం.. బేడీలతోనే లగచర్ల రైతు ఆస్పత్రికి తరలింపు


వారధి చిత్రంలో ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను మేళవించి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఇవ్వడానికి ప్రయత్నించామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా వచ్చే తరానికి ప్రత్యేకమైన ట్రీట్‌గా నిలుస్తుందని అవి చెప్పారు. 


సాంకేతికపరంగా ఈ సినిమా చాలా బలమైనదిగా ఉండబోతోంది అని తెలిపారు చిత్ర యూనిట్. చిత్రంలో కథా కథనాలు, నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల కృషి ప్రధానంగా నిలవబోతున్నట్లు సమాచారం. నాగేంద్ర పలగాని రాసిన కథ, శక్తి .జె కె అందించిన సినిమాటోగ్రఫీ, షారుఖ్ షేక్ అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని తెలుస్తోంది . 


ఇది ఒక ప్రేమ కథగా, రొమాన్స్, థ్రిల్లర్, డ్రామా కలిపి రూపొందించబడిన చిత్రం. ప్రేక్షకులందరికీ ఒక ప్రత్యేక అనుభూతిని ఇవ్వాలని చిత్రయూనిట్ భావిస్తోంది.  వారధి సినిమా త్వరలోనే విడుదలకానుంది. ఇది ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతుందని సినిమా యోని తాసిస్తున్నారు.  వెబ్జీయార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్  సమర్పణలో..రాధాకృష్ణ ఆర్ట్స్  బ్యానర్ పై పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


Also Read: KT Rama Rao: రైతుకు సంకెళ్లు రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనం



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.