Lagacharla Farmer Hand Cuffs: గుండెపోటుకు గురయిన లగచర్ల గిరిజన రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అమానవీయం, రేవంత్ క్రూర మనసత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. జైలులో ఉన్న రైతు బిడ్డ హీర్యా నాయక్‌కు నిన్న గుండెల్లో నొప్పి వస్తే.. వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు చెప్పకుండా, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఆస్పత్రికి తరలించకుండా.. చికిత్స అందించకుండా అమానవీయంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Lagacharla Farmer: తెలంగాణ పోలీసులు మరో దారుణం.. బేడీలతోనే లగచర్ల రైతు ఆస్పత్రికి తరలింపు
సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్ గుండెపోటుకు గురవగా అతడిని బేడీలతోనే ఆస్పత్రికి తరలించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఖండిస్తూ హైదరాబాద్‌లోని నంది నగర్‌లో ఉన్న తన నివాసంలో కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తోందని.. బేడీలు వేసి అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా లగచర్ల రైతులకు తాము అండగా ఉంటామని ప్రకటించారు.
Also Read: One Election: మోదీ ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలకు ఆమోదం
'హీర్యా నాయక్‌తోపాటు లగచర్ల రైతులు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం బాగాలేదని.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి' అని కేటీఆర్ వివరించారు. రైతుబిడ్డకు బేడీలు వేసి అన్యాయంగా.. అమానవీయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువచ్చింది. స్ట్రెచర్‌పై.. అంబులెన్స్‌లో తీసుకురావాల్సిన మనిషిని బేడీలు వేసి తీసుకువచ్చారు. ఇంతటి దుర్మార్గమైన అమానవీయమైన ప్రవర్తన క్షమార్హం కాదు' అని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
'ఇలా చేయడం రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమే. కొత్త క్రిమినల్ చట్టం బీఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా.. పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రావెల్స్ ఖైదీల హక్కులను హరించడమే' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలి. గవర్నర్ కూడా ఈ అంశంపై విచారణకు ఆదేశించాలి' అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
'రైతులను వేధిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం జైపూర్‌లో విందులు.. వినోదాలలో జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారు. కానీ తెలంగాణ గిరిజన రైతులు మాత్రం జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు' అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి హృదయం ఉంటే గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే కేసులు రద్దు చేయాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 'మేము చెప్పిందే నడవాలని అహంకారంతో రేవంత్ రెడ్డి ఆయన సోదరులు గిరిజన రైతన్నల ప్రాణాలు తీస్తున్నారు' అని ఆరోపించారు. 'నా మాట వినలేదు అనే ఏకైక కారణంతోనే లగచర్ల రైతులపై రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు' ని తెలిపారు.
బేషజాలకు పోకుండా గిరిజన రైతులపై అక్రమ కేసులను వెనక్కి తీసుకొని జైలు నుంచి విడిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. 'రేవంత్ రెడ్డి మాత్రం కక్షపూరితంగా రైతులపై కేసులు పెట్టించారు. ఆయన అహంకారం దెబ్బతిన్నదని, ప్రతిష్టకు తీసుకొని అదే రోజు 17 మంది రైతన్నలను అరెస్ట్ చేయించారు' అని గుర్తుచేశారు. అదుపులోకి తీసుకున్న రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ టార్చర్ చేశారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.