Kushi Kapoor in Mokshagna Debut: నందమూరి అభిమానులు అందరూ కలలు కంటున్న రోజు వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా చేస్తున్నట్లు ప్రకటించేశారు. నందమూరి ఈ వారసుడి డెబ్యూ సినిమా కోసం అభిమానులు.. కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాంబిరెడ్డి, హను మ్యాన్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండబోతోంది అని సమాచారం. ఇందులో ఉన్న విజువల్స్, స్క్రీన్ ప్లే ఇంతకుముందు ఎప్పుడు చూసి చూడనటువంటి అద్భుతంగా ఉంటాయని.. సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. 


మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించనున్నారు అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ తన కొడుకు డెబ్యూ సినిమా కోసం.. ఒక స్టార్ హీరోయిన్ చెల్లెలిని హీరోయిన్ గా.. రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు జాన్వి కపూర్. 


లెజెండరీ నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ చెల్లెలు అంటే శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్.. ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన హీరోయిన్గా కనిపిస్తుంది అని సమాచారం. మరోవైపు జాన్వి కపూర్ త్వరలో ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఇంకా ఖుషి కపూర్ ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అని తెలుస్తోంది. 


ఒకవేళ ఇది నిజం అయితే.. శ్రీదేవి ఇద్దరు కూతుర్లని నందమూరి హీరోలు తెలుగు దరికి పరిచయం చేసినట్లే అవుతుంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.


Also Read: Double iSmart: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల.. ఎంటర్టైన్మెంట్ డబుల్.. అంచనాలు కూడా డబుల్..!


Also Read: Rajamouli: బాహుబలిలో అలాంటి తమన్నా సీన్స్ అందుకే పెట్టాము.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter