టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుంచి దగ్గుబాటి వారబ్బాయి రానా (Rana Daggubati) పేరును తొలగించేశారు. దగ్గుబాటి రానా, మిహికా బజాజ్‌ల వివాహం (Rana Daggubati Married to Miheeka Bajaj) శనివారం రాత్రి రామానాయుడు స్టూడియోలో వేడుకగా జరిగింది. కేవలం కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రేమ జంట రానా, మిహికా వివాహ బంధంతో ఒక్కటైంది. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్, మరికొందరు అతిథులు వివాహానికి హాజరై రానా, మిహికాలకు శుభాకాంక్షలు తెలిపారు. రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి ఫోటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రానా పెళ్లి విషయంలో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి అంచనా (SS Rajamouli Prediction About Rana Daggubati Wedding) నిజమైంది. దాదాపుగా రెండేళ్ల ముందే రానా వివాహం గురించి రాజమౌళి (SS Rajamoul)i అంచనా వేసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హిందీ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గొన్న సందర్భంగా బాహుబలి స్టార్స్ ప్రభాస్, దగ్గుబాటి రానాల పెళ్లి గురించి రాజమౌళి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాజాగా రానా వివాహం కావడంతో.. రాజమౌళి అంచనా నిజమైందని, జక్కన్న అంచనా తప్పదంటూ టాలీవుడ్ ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. COVID19 Symptoms: కరోనా ముఖ్యమైన లక్షణాలివే 


జక్కన్న ఏం చెప్పారంటే..
బాహబలికి సిగ్గు ఎక్కువ. అతడు చాలా బద్ధకస్తుడు. పెళ్లి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడు. ఇప్పట్లో అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోడని ఆ షోలో పాల్గొన్న సందర్భంగా రాజమౌళి చెప్పారు. రానా మాత్రం చాలా యాక్టివ్ అని, ప్రభాస్ కంటే ముందుగా రానా వివాహం చేసుకుంటాడని రాజమౌళి అంచనా వేశారు. వయసులో ప్రభాస్ పెద్దవాడు అయినప్పటికీ రానానే ముందుగా పెళ్లిపీటలెక్కుతాడని జక్కన్న అభిప్రాయపడ్డారు. రాజమౌళి చెప్పిందే జరగడంతో జక్కన్న అంచనా తప్పదంటూ కామెంట్ చేస్తున్నారు. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...