Thaman Copy Tune: శంకర్ ను కూడా మోసం చేసిన తమన్.. ట్యూన్ అక్కడి నుంచి తెచ్చాడా?
SS Thaman Copy Tune for RC 15: ఇప్పటికే అనేక సార్లు కాపీ ట్యూన్ తో అడ్డంగా దొరికిన తమన్ ఇప్పుడు మరోమారు కాపీ ట్యూన్ చేసి దొరికేశాడు. 2010లోని హిందీ సినిమా సాంగ్ ట్యూన్ లానే ఆర్సీ 15 నేం అనౌన్సింగ్ వీడియోలో కనిపిస్తోంది.
SS Thaman Copy Tune for RC 15 Game Changer Title Reveal Video: ఎస్ఎస్ తమన్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో ఒక హపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలకు తమన్ ఏకైక ఆప్షన్ గా మారిపోయారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎప్పుడో గాని హిట్ కాకపోతూ ఉండడం, తమన్ చేస్తున్న అన్ని సినిమాల్లో పాటలు చాట్ బస్టర్స్ గా నిలుస్తూ ఉండడంతో ఎక్కువగా తమన్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తమన్ ఒకపక్క బిజీగా ఉంటూనే మరోపక్క కాపీ ట్యూన్స్ అందిస్తున్నాడని కాపీ మరకలతో ఇబ్బంది పడుతున్నాడు.
ఇప్పటికే అనేక ట్యూన్స్ విషయంలో అడ్డంగా దొరికిపోయిన తమన్ ఇప్పుడు రామ్ చరణ్ 15వ సినిమా గేమ్ చేంజెర్ టైటిల్ రివీల్ పోస్టర్ వీడియో కోసం చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా వెంటనే దొరికిపోయాడు. ఒకప్పుడు సోషల్ మీడియా అంతగా అందుబాటులో లేని సమయంలో ఇలాంటి విషయాలు పెద్దగా సీరియస్ గా తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ నుంచి కాపీ ట్యూన్ తెచ్చారు అనే విషయాన్ని కూడా బట్టబయలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
తాజాగా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ కొందరు తమన్ ట్యూన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే వీడియో కూడా బయట పెట్టారు. 2010 సంవత్సరంలో బాలీవుడ్ లో రూపొందిన ఆయేషా అనే మూవీ నుంచి యూట్యూబ్ ని తీసుకొచ్చారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో అభయ్ డియోల్ తో పాటు సోనం కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు ఒక పెళ్లి సందర్భంగా కుటుంబం అంతా కలిసి డాన్స్ చేస్తున్నప్పటి సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది.
అమిత్ త్రివేది సంగీతం అందించినం గల్ మిట్టి మిట్టీ సాంగ్ ట్యూన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి వాడేశాడు తమన్. అయితే తమన్ ఎప్పటికప్పుడు తాను కథను బట్టి మ్యూజిక్ ఇస్తానని చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఇలాంటి ట్యూన్స్ వస్తే అది దర్శకుడు తప్పు అని వారి మీద తోసేస్తూ ఉంటారు. ఈసారి ఏకంగా శంకర్ ను కూడా థమన్ మోసం చేశాడంటూ నెటిజన్లు చర్చించుకోవడం కనిపిస్తోంది.
Also Read: Actor Innocent death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. స్టార్ కమెడియన్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook