Pushpa Part 1, Part 2 titles: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు రానుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పుష్ప అనే టైటిల్‌ని అలాగే కొనసాగిస్తారా ? లేక రెండు భాగాలుగా విభజించిన క్రమంలో టైటిల్ సౌలభ్యం కోసం పుష్ప టైటిల్‌ను మారుస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండు భాగాలుగా వచ్చిన చిత్రాల జాబితాను ఓసారి పరిశీలిస్తే..., రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1 ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్‌క్లూజన్, దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్ ఛాప్టర్-1, కేజీఎఫ్ ఛాప్టర్-2 .., క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీని కథా నాయకుడు, మహానాయకుడు అనే వేర్వేరు టైటిల్స్‌పై రిలీజయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో పుష్ప సినిమా కూడా గత చిత్రాల తరహాలో రెండు వేర్వేరు టైటిల్స్‌పై రిలీజవుతాయా లేక ఒకే టైటిల్‌పై.. అంటే 'పుష్ప పార్ట్ 1', 'పుష్ప పార్ట్ 2' (Pushpa Part 1, Pushpa Part 2) అని రిలీజవుతాయా అనే సందిగ్ధత నెలకొని ఉంది. ఈ విషయంలో పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తాజాగా ఓ టాక్ వినిపిస్తోంది. అదేమంటే.. ఇప్పటికే అన్ని భాషల్లో పుష్ప అనే టైటిల్‌తో సినిమా గురించి పరిచయం జరిగినందున.. ప్రస్తుతానికి పుష్ప సినిమా టైటిల్‌ను మార్చకుండానే ఫస్ట్ పార్ట్ విడుదల చేసి.. రెండో పార్ట్ విడుదల నాటికి ఆ తర్వాతి విషయం ఆలోచించవచ్చని సుకుమార్ భావిస్తున్నట్టు టాక్. 


Also read : Vaishnav Tej: కబడ్డీ ఆటగాడిగా వైష్ణవ్ తేజ్, కొత్త లుక్ కోసం సన్నాహాలు


పుష్ప ఫస్ట్ ఫార్ట్‌కి సంబంధించి మరో 30 రోజుల షూటింగ్ కూడా జరగాల్సి ఉందట. కరోనాతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. కరోనా కాస్త సద్దుమణిగాకా ఆ మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి, ఇదే ఏడాది చివరినాటికి పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ (Pushpa part 1 release date) చేయాలని మూవీ యూనిట్ ప్లాన్స్ చేసుకుంటోంది. 


అల్లు అర్జున్ (Allu Arjun) సరసన రష్మిక మంధన జంటగా నటించనున్న ఈ సినిమాలో మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఓ అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. పుష్ప మూవీ తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆడియెన్స్ ముందుకు రానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో పుష్ప మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.


Also read : Jr Ntr birthday: తారక్ బర్త్ డే నాడే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రకటన ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook