Vaishnav Tej: కబడ్డీ ఆటగాడిగా వైష్ణవ్ తేజ్, కొత్త లుక్ కోసం సన్నాహాలు

Vaishnav Tej: ఉప్పెన సినిమా సృష్టించిన విజయం అంతా ఇంతా కాదు. పేరుకు తగ్గట్టే ఉప్పెనంత విజయం మూటగట్టుకుంది. అందుకే ఆ హీరో హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ తాజాగా మరో సినిమాకు సైన్ చేశాడట. ఆ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఎలా కన్పించబోతున్నాడనేదే ఆసక్తిగా మారింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2021, 03:14 PM IST
Vaishnav Tej: కబడ్డీ ఆటగాడిగా వైష్ణవ్ తేజ్, కొత్త లుక్  కోసం సన్నాహాలు

Vaishnav Tej: ఉప్పెన సినిమా సృష్టించిన విజయం అంతా ఇంతా కాదు.పేరుకు తగ్గట్టే ఉప్పెనంత విజయం మూటగట్టుకుంది. అందుకే ఆ హీరో హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ తాజాగా మరో సినిమాకు సైన్ చేశాడట. ఆ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఎలా కన్పించబోతున్నాడనేదే ఆసక్తిగా మారింది.

కరోనా సంక్షోభంతో(Corona Crisis) కష్టాల్లో పడిన తెలుగు సినీ పరిశ్రమకు ఊపిరి ఊదిన సినిమా ఉప్పెన (Uppena Movie) అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో కరోనా మొదటి వేవ్ తరువాత లాక్‌డౌన్ అనంతరం విడుదలై..భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఉప్పెనంత విజయంతో దూసుకుపోయింది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ తేజ్ వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు. స్టార్ డౌరెక్టర్ జాగర్లమూడి క్రష్‌తో ఓ సినిమా ఇప్పటికే పూర్తయింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. వైష్ణవ్ మూడవ సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పాత్రపై అంచనాలు ఎక్కువవుతున్నాయి. పృధ్వీ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపధ్యంలో ఉండనుంది.

వైష్ణవ్ తేజ్(Vaishnav Tej ) ఈ మూవీలో కబడ్డీ ప్లేయర్‌గా సందడి చేయనున్నాడని తెలుస్తోంది. అసలు విషయమేమంటే ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. సినిమా కోసం వైష్ణవ్ తేజ్ లుక్ మార్చుకోనున్నాడట. కొత్త లుక్‌లో కన్పించబోతున్నాడు.

Also read: Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ భామ Divi Vadthya క్యాబ్ స్టోరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News