Supritha Buys New MG Model Car సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితలు సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. సుప్రిత తాజాగా కారు కొన్నట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు సుప్రిత వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మంచి జరగడానికి కాస్త టైం పడుతుంది అంటూ సుప్రిత వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్‌కు సుప్రిత కామెంట్ సెక్షన్‌ను మూసివేసింది. తనకు నచ్చిన వారు మాత్రమే కామెంట్లు పెట్టేలా సెట్ చేసుకుంది. దీంతో నార్మల్ నెటిజన్లు ఆమెకు కామెంట్లు పెట్టలేకపోతోన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సురేఖా వాణికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. సుప్రితకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఒకప్పుడు డ్యాన్స్ వీడియోలతో, టిక్ టాక్ వీడియోలతో నానా హంగామా చేశారీ తల్లికూతుళ్లు. భర్త చనిపోయిన కొన్నిరోజులకే డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ సురేఖా వాణి నానా రచ్చ చేసింది. ఇక బెడ్ రూంలో ఇష్టమొచ్చినట్టుగా సురేఖా వాణి, సుప్రితలు డ్యాన్స్ చేసిన వీడియో లీకవ్వడంతో అప్పట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు ఈ తల్లీకూతుళ్లిద్దరూ నెట్టింట్లో హంగామా చేస్తుంటారు. ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు. అందంలో పోటీ పడుతున్నట్టుగా ఇద్దరూ రెడీ అవుతుంటారు. అయితే నెటిజన్లు మాత్రం సురేఖా వాణికే ఓటు వేస్తుంటారు. అందరూ సురేఖా వాణి అందాలకు ఫిదా అవుతుంటారు. అంకుల్స్ అంతా కూడా సురేఖా వాణి రెండో పెళ్లి కోసం లైన్‌లో ఉన్నట్టుగా మీమ్స్ చక్కర్లు కొడుతుంటాయి. వాటిని సురేఖా వాణి సైతం షేర్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటుంది.


 



సురేఖా వాణి ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉంది. తన కూతుర్ని కూడా సినిమాల్లోకి తీసుకు రావాలని బాగానే ఆరాట పడుతోంది. అయితే ఆమె హీరోయిన్‌గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ తాజాగా సుప్రిత మాత్రం కారు కొనేసింది. ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్ ద్వారా సుప్రిత కూడా బాగానే సంపాదించేస్తోంది. తాజాగా ఎంజీ మోడల్ కారును సుప్రిత కొన్నట్టుగా కనిపిస్తోంది. దీని ధర ఇరవై లక్షలు ఉండొచ్చని తెలుస్తోంది.


Also Read:  Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్


Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook