తమిళ ప్రఖ్యాత నటుడు ( Tamil actor) తళపతి విజయ్ ( Thalapathy vijay ) ఇంటికి బాంబు బెదిరింపు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. చెన్నై ( Chennai) లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఓ ఫోన్ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. అణువణువునా గాలింపు అనంతరం ఫేక్ కాల్ గా తేల్చారు పోలీసులు. సరిగ్గా నెల రోజుల క్రితం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి కూడా బాంబు బెదిరింపు రావడం అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తమిళ ప్రేక్షకుల తళపతిగానే కాకుండా తెలుగులో సైతం అభిమానుల్ని సంపాదించుకున్న విజయ్ ( Actor Vijay) పేరు అందరికీ సుపరిచితమే. విజయ్ స్టైల్ కు తమిళనాట ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. సాలిగ్రామమ్ ( Saligramam) లోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టారన్నది ఆ ఫోన్ సారాంశం. అంతే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలో దిగి...బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ ను రప్పించారు. అణువణువూ గాలించిన అనంతరం బాంబు లేదని తేల్చారు. ఫోన్ కాల్ రికార్డును పరిశీలించిన పోలీసులు అదొక ఫేక్ కాల్ గా ( hoax call ) ధృవీకరించారు. అనంతరం ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్నదీ ట్రేస్ చేసి...అతని మానసిక పరిస్థితి బాగా లేదని తేల్చారు. ఫోన్ చేసిన యువకుడిని విల్లుపురం జిల్లా మరక్కాణమ్ కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. యువకుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా హెచ్చరించి వదిలేశారు పోలీసులు. సరిగ్గా నెల రోజుల క్రితం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ( Superstar Rajnikanth ) ఇంట్లో కూడా బాంబు ఉందంటూ  ఓ ఫేక్ ఫోన్ కాల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ చేసిన వ్యక్తి పరిస్థితి కూడా మానసికంగా సరిగ్గా లేదని తెలిసింది. Also read: RGV: వర్మపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..