Tammareddy Bharadwaj On Gaalodu : బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వెండితెరపైనా తన సత్తాను చాటేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ అంటూ ఇలా నానా రకాలుగా ప్రయత్నించాడు. కానీ హిట్టు కొట్టలేకపోయాడు. ఇప్పుడు గాలోడు అంటూ సుధీర్ అందరి ముందుకు వచ్చేశాడు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. నిన్నటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న జరిగిన గాలోడు సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నాడు. ముందుగా ఈ చిత్రం చేయకూడదని అనుకున్నాడట. కానీ పదే పదే అడగడటంతో యస్ చెప్పాడట. ఓ సీన్ వివరించడంతో అది చాలా కొత్తగా, చాలా బాగుందని అనిపించిందట. ఈ సీన్ ఎలాగైనా బాగా చేయాలని అనుకున్నాడట. కానీ ఆ రోజు చాలా లేట్ అయిందట. చివరకు షాట్ తీసేశారని, అయితే తాను అనుకున్నట్టుగా ఆ సీన్ రాలేదని అనిపించిందట.


కానీ డైరెక్టర్ తన కథ, కథనంతో తెరపై మ్యాజిక్ చేశాడట. తాను అనుకున్నంతగా సీన్ రాకపోయినా కూడా బాగానే వచ్చిందని తమ్మారెడ్డి అన్నాడు. ఇక సుధీర్‌ చాలా కష్టపడ్డాడు.. అదృష్టం కూడా కలిసి వచ్చింది.. ఈ గాలోడు సినిమాది పెద్ద కథేమీ కాదు.. పెద్ద చించేసే కథ కూడా కాదు.. కానీ మ్యాజిక్ చేశాడు అంటూ సుధీర్ మీద ప్రశంసలు కురిపించాడు తమ్మారెడ్డి భరద్వాజ.


ఇక కెమెరామెన్ రాం ప్రసాద్ గురించి చెబుతూ.. వాడు అందరినీ బాగా చూపించాడు.. నన్ను తప్పా.. నేను బ్యాడ్ యాక్టర్ అని తెలుసు.. కానీ ఇంత బ్యాడ్ యాక్టర్ అని నాకు తెలిసింది ఈ సినిమాలోనే.. అందరూ బాగానే కనిపించారు.. నన్ను మాత్రం సరిగ్గా చూపించలేదు.. సినిమా చూసి నాకు బాధేసింది.. అంటూ ఇలా నవ్వులు పూయించాడు.


Also Read : Avatar The Way Of Water టికెట్ రేట్లు.. జేబులు గుల్ల అవ్వాల్సిందేనా?


Also Read : Keerthy Suresh pics : 8వ శతాబ్దం నాటి పురాతన గుడిలో మహానటి.. కీర్తి సురేష్ ఎంత సింపుల్‌గా ఉందో.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook