ఘనంగా హీరో కార్తికేయ వివాహం- కొత్త జంటకు మెగాస్టార్ ఆశీర్వాదం
Karthikeya: ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రేయసి లోహిత మెడలో మూడు ముళ్లు వేసి.. ఓ ఇంటివాడయ్యారు.
Hero Karthikeya Wedding: తెలుగు నటుడు, యువ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. 11 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి లోహితను నేడు వేద మంత్రాల నడుమ వివాహమాడాడు.
ఇవాళ ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత మెడలో మూడు ముళ్లు వేసి.. ఏడడుగులు నడిచాడు ఈ యువ హీరో. వైభవంగా జరిగిన కార్తికేయ-లోహితల వివాహానికి (Karthikeya weds Lohitha).. ఇరువురి బంధు, మిత్రులతో పాటు.. టాలీవుడ్ ప్రముఖులూ హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి నవ వధూవరులను స్వయంగా (Chiranjeevi At Hero Karthikeya Marriage) ఆశీర్వదించారు. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్, కమేడియన్ సుదర్శన్ సహా పలువురు వివాహానికి విచ్చేశారు.
ఇక కార్తికేయ కెరీర్‌ను మలుపు తిప్పిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరియిన్‌గా నటించిన పాయల్ రాజ్‌పుత్ (Payal rajputh At Hero Karthikeya Marriage) కూడా పెళ్లిలో సందడి చేశారు. అమె తన బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లికి హాజరు కావడం విశేషం.
Also read: కైకాల ఆరోగ్యంపై చిరు ట్వీట్...త్వరలో ఇంటికి తిరిగి వస్తారన్న మెగాస్టార్...
Also read: ఫ్యాషన్ అవుట్ ఫిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న బాలీవుడ్ సూపర్ కపుల్ కరీనా, సైఫ్ అలీఖాన్
కార్తికేయ లవ్ స్టోరీ..
వరంగల్ నిట్‌లో చదువుతున్నప్పుడు 2010లో లోహిత-కార్తికేయల మధ్య స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దాదాపు 11 ఏళ్లు రిలేషన్లో ఉన్న వీరికి ఈ ఏడాది ఆగస్టులో ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది.
ఎంగేజ్మెంట్ సమయంలోనే తన లవ్ స్టోరీ గురించి (Karthikeya Lohitha love story) బయటపట్టారు కార్తికేయ. ఆ తర్వాత కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లోహితను పరిచయం కూడా చేశారు.
తన లైఫ్‌లో హీరో అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో.. తనకు ఇష్టమైన అమ్మయి (Karhikeya Girl friend) ప్రేమను పొందేందుకు అంతే ప్రయత్నం చేశానని చెప్పారు కార్తికేయ. ఈ సందర్భంగా ప్రేమకోసం పడిన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. ఎట్టకేలకు అన్ని సవ్యంగా జరిగి.. ఈ ప్రేమ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.
కార్తికేయ గురించి..
2017లో ప్రేమతో మీ కార్తిక్ అనే సినిమా ద్వారా టాలీవుడ్లో అడుగు పెట్టారు కార్తికేయ. ఆ తర్వాతి సంవత్సరం వచ్చిన ఆర్ఎక్స్ 100 ఘన విజయం సాధించింది. దీనితో కార్తికేయకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు కార్తికేయ.
ఇటు హీరోగా చేస్తూనే.. నాని నటించిన గ్యాంగ్ సినిమాలో విలన్‌గా మెప్పించారు. ఇప్పుడు తమిళ అగ్రనటుడు అజిత్ హీరోగా వస్తున్న వాలిమైలో కూడా విలన్‌గా నటిస్తున్నారు కార్తికేయ.
ఇక కార్తికేయ నటించిన తాజా చిత్రం రాజా విక్రమార్క ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also read: బ్రేకింగ్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం
Also read: నాగార్జున: షణ్ముఖ్.. దీప్తిని మిస్ అయితే...ఇంటి నుంచి వెళ్లిపోవచ్చు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook