Telugu Biggest Hit 2024: సాధారణంగా వందల కోట్ల బడ్జెట్ పెట్టి, అంతకుమించి ప్రమోషన్స్ చేపట్టి, వేలకోట్ల కలెక్షన్స్ వచ్చినా ఆ సినిమా పెద్దగా విజయం సాధించినట్టు కాదు అని కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్,  ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే మొదటి షో తో కంటెంట్ ను మెచ్చి ఆడియన్స్ థియేటర్లకు వచ్చి, వందల కోట్ల కలెక్షన్స్ రాబడితే అది సరైన విజయం అని కూడా చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పుష్ప2 సరికొత్త రికార్డు సృష్టించింది అది వేరే విషయం. కానీ పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం ఈ సినిమా ఇప్పుడు వెనకబడిపోయిందని చెప్పాలి. యంగ్ హీరోతో చిన్న సినిమాగా పాన్ ఇండియా వైడ్ గా విడుదలై ఊహించని కలెక్షన్లు సొంతం చేసుకుని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటిన చిత్రం హనుమాన్. ఈ సినిమా కథ, కంటెంట్, నటీనటుల పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టి సమంత నటించిన ఓ బేబీ సినిమాతో నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో తేజ సజ్జ, జాంబీ రెడ్డి సినిమాతో పర్వాలేదనిపించుకున్నారు. కానీ హనుమాన్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని సంక్రాంతి బరిలోకి దిగి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని కూడా ఢీ కొట్టగలిగారు అంటే ఈ సినిమా కథ ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.


ఇకపోతే ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టి తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సత్య చాటిన చిత్రంగా హనుమాన్ రికార్డు సృష్టించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లకి పైగా  కలెక్షన్స్ వసూలు చేసింది.  అంటే 625% కంటే ఎక్కువ లాభ శాతం ఉత్పత్తిని కలిగి ఉంది. పుష్ప 2 కంటే హనుమాన్ ఎంత లాభదాయకంగా ఉందో ఒక తేడాని కూడా విశ్లేషకులు చూపించారు. 


పుష్ప2  రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1508 కోట్లు రాబట్టింది. అందువల్ల ఇది 201.6% దగ్గర లాభ శాతాన్ని కొనసాగిస్తుంది. ఇక దీన్ని బట్టి చూస్తే హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.


Also Read: Bank Merger:  ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..తెలంగాణలో ఈ  బ్యాంక్ కనిపించదు..డిసెంబర్ 27లోపు పనులన్నీ పూర్తి చేసుకోండి


Also Read:PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook