Anchor Pradeep and Anchor Sreemukhi's special show on Dasara 2020: ఇండియా, చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందిన భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ సంతోష్ బాబుకు ఓ కార్యక్రమం ద్వారా జీ తెలుగు ఘన నివాళి ( Tribute to Martyred Lt Col Santosh Babu ) అర్పించింది. దేశం కోసం వీర సైనికుడి త్యాగాన్ని ఓ సూపర్ పర్‌ఫార్మెన్స్ ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. గూస్‌బంప్స్ వచ్చే ఈ పర్‌ఫార్మెన్స్‌కి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు బుధవారం విడుదల చేసింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పండగలు, ప్రత్యేకమైన సందర్భాలు వచ్చాయంటే ప్రతి టీవి చానల్ వాళ్ళు ప్రత్యేకమైన ప్రొగ్రామ్స్‌తో  ప్రేక్షకులను మరింత అలరించేందుకు సిద్ధంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అదే జీ తెలుగులో అయితే.. ఆ ఎంటర్‌టైన్మెంట్ ఇంకో రేంజ్‌లో ఉంటుందనే విషయం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ దసరా పండగ సందర్భంగా మరింత ఎంటర్టెయిన్మెంట్‌తో తెలుగు ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు జీ తెలుగు సిద్దమైంది.



సరిగమప సీజన్ 13 కంటెస్టెంట్స్ ( Zee Telugu Sarigamapa ) బతుకమ్మ, దసరా పండగ ప్రత్యేకతను తెలుపుతూ పాడిన ‘దసరా పండుగ అంట’ అనే పాటను జీ తెలుగు బుధవారం ట్విటర్ ద్వారా బుధవారం విడుదల చేసింది. అలాగే దసర పండగ సందర్భంగా అక్టోబర్ 25న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘చి. ప్రదీప్‌కి చి. ల. సౌ. శ్రీముఖి నమస్కరిస్తు వ్రాయునది’ అనే ఎంటర్‌టైన్మెంట్ షో ప్రసారం కానుంది. Also read : Ramaraju for Bheem teaser: 'రామరాజు ఫర్ భీమ్ ' సీక్రెట్ ఇదేనా ?



‘చి. ప్రదీప్‌కి చి. ల. సౌ. శ్రీముఖి నమస్కరిస్తు వ్రాయునది' ప్రోగ్రాంకి యాంకర్ ప్రదీప్ మాచిరాజు ( Anchor Pradeep ), యాంకర్ శ్రీముఖి ( Anchor Sreemukhi ) హోస్ట్‌లుగా వ్యవహరిస్తుండగా.. మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కూతురు నిహారికా కొనిదెల ( Nagababu, Niharika ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యాంకర్ అనసూయ భరద్వాజ్ ( Anchor Anasuya Bharadwaj ), ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, పండు మాస్టర్, వేణు, ధన్‌రాజ్, చంద్ర, గల్లీ బాయ్స్ తదితరులు ఈ షోలో సందడి చేశారు. ఈ షోలో మిగతా పర్‌ఫార్మెన్సెస్ చూడాలంటే ఆ రోజు జీ తెలుగులో చి ప్రదీప్‌కి చి ల సౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది షో చూడాల్సిందే. Also read : Bhumika Chawla divorce rumors: భూమిక విడాకులు.. సమాధానం ఇదిగో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe