Bhumika Chawla divorce rumors: భూమిక విడాకులు.. సమాధానం ఇదిగో..

Actress Bhumika Chawla wedding anniversary: ఖుషి, ఒక్కడు, సింహాద్రి, వాసు, మిస్సమ్మ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన భూమిక చావ్లా అంటే టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు. ఐతే భూమిక తన భర్తతో విడిపోయిందని ( Bhumika Chawla divorce ) కొంత కాలంగా పుకార్లు వ్యాపించాయి. ఈ రోజు భూమిక మ్యారేజ్ డే ( Bhumika Chawla marriage day) సందర్బంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, తన భర్తకి మ్యారేజ్ డే విషెస్ చెప్పి అన్ని పుకార్లకు చెక్ పెట్టింది.

Last Updated : Oct 21, 2020, 07:10 PM IST
Bhumika Chawla divorce rumors: భూమిక విడాకులు.. సమాధానం ఇదిగో..

Actress Bhumika Chawla wedding anniversary: ఖుషి, ఒక్కడు, సింహాద్రి, వాసు, మిస్సమ్మ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన భూమిక చావ్లా అంటే టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు.  ఐతే భూమిక తన భర్తతో విడిపోయిందని ( Bhumika Chawla divorce ) కొంత కాలంగా పుకార్లు వ్యాపించాయి. ఈ మధ్య కాలంలో వాళ్లు పబ్లిక్‌లోకి వచ్చినపుడు భూమిక భర్త ఆమెకి దూరంగా ఉంటున్నాడని.. అలాగే, భూమిక కూడా చాలా కాలంగా తన సోషల్ మీడియా పోస్ట్‌లలో తన భర్త గురించి ప్రస్తావించడం లేదని ఏవేవో టాక్స్ వినిపించాయి.

ఈ రోజు భూమిక మ్యారేజ్ డే ( Bhumika Chawla marriage day) సందర్బంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, తన భర్తకి మ్యారేజ్ డే విషెస్ చెప్పి అన్ని పుకార్లకు చెక్ పెట్టింది. ఈ సందర్భంగా భూమిక తన ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. " వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని.. ఆ ఒక్క అడుగు ప్రేమేనని... ప్రేమ అంటే ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం.. మనల్ని, మన జంటను ఆ దేవుడు ఆశీర్వదించాలి. హప్పీ యానివర్సరీ" అని రాసుకొచ్చింది. ఈ సందర్భంగా భర్తకు కృతజ్ఞతలు చెప్పిన భూమిక.. కష్టపడే నీ మనస్తత్వాన్ని చూసి గర్వంగా ఉందని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. 



View this post on Instagram


A journey of a thousand miles begins with a single step .... LOVE ....... and it’s love , learning , understanding , a journey of laughter and moments .... discovering more about each other And ourselves ... Thank you for Everything 🌺 ...... may God bless us and our journey together .. Proud of you and your hard work and your dedication to whatever you do in life 😊 .. 🌸💕💐 Happy Anniversary 💐🌻

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on

భూమిక తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు  2007 లో యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను ( Bhumika Chawla's husband Bharath Thakur ) వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లి తరువాత భూమిక టాలీవుడ్‌లో సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసింది, కాని వరుసగా ఫ్లాప్‌‌లు రావడంతో తర్వాత సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఆపేసింది. ఆ తరువాత భూమిక కుటుంబం హైదరాబాద్ నుండి ముంబైకి షిఫ్ట్ అయ్యారు.

రెండేళ్ల క్రితం హీరో నాని నటించిన ‘ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంతో ( MCA movie ) భూమిక టాలీవుడ్‌లోకి తిరిగి అడుగుపెట్టింది. ఆ తరువాత ‘యు-టర్న్’, ‘సవ్యసాచి’, ‘రూలర్’ వంటి చిత్రాల్లో నటించింది. భూమిక నెక్స్ట్ ‘సీటిమార్’ ( Seetimaarr ) సినిమాలో కనిపించనుంది.

భూమిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే... ఆ ఇద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భూమిక పోస్ట్ చూశాకానైనా.. భూమిక విడాకులు తీసుకుంటోందనే పుకార్లకు చెక్ పడుతుందని ఆశిద్దాం.

Trending News