Truth Behind Prabhas being Main Reason for AHA Video APP Crash: నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికె షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఆహా యాప్ కి మరింత బూస్ట్ అప్ తీసుకొచ్చిందని కూడా ఆహా యాజమాన్యమే స్వయంగా ఒప్పుకుంది. ఇక ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన సెకండ్ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. అయితే ప్రభాస్ గోపీచంద్ కలిసి పాల్గొన్న ఒక ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 30వ తేదీన మొదటి భాగం విడుదల చేయాల్సి ఉండగా అభిమానులు కోరిక మేరకు డిసెంబర్ 29వ తేదీన విడుదల చేశారు. మరొక భాగాన్ని జనవరి 6వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే డిసెంబర్ 29వ తేదీన ఎప్పుడైతే ప్రభాస్ ఎపిసోడ్ రిలీజ్ అయిందో ఆహా యాప్ క్రాష్ అయింది. ఇంటర్నెట్ లో కూడా ఆహా వీడియో లాగిన్స్ ఆగిపోయాయి. అయితే ప్రభాస్ కారణంగానే ఆయన క్రేజ్ కారణంగానే తమ యాప్ ఆగిపోయిందని ఆహా యాజమాన్యం ప్రకటించింది.


ప్రభాస్ మీదకు తోశారా?


అయితే ఆహా యాప్ ప్రభాస్ ఎపిసోడ్ కారణంగా క్రాష్ అవ్వలేదని ఏదో టెక్నికల్ గ్లిచ్ రాగా దాన్ని ఇప్పుడు ప్రభాస్ మీదకు తోస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సరే ఆ సంగతి పక్కన పెడదాం అయితే కేవలం ప్రభాస్ ఎపిసోడ్ కారణంగానే ఆహా క్రాష్ అయిందని ఆహా యాజమాన్యం చెప్పింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ కి ఎందుకు అంత క్రేజ్ ఉంది? అని ఆలోచించారా? అయితే ఈ స్టోరీ చదవండి.  వాస్తవానికి ప్రభాస్ కు బాహుబలి తర్వాత సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. సాహో సినిమా డిజాస్టర్ గా నిలిచింది.


సినిమాల మీద లేని ఆసక్తి ఇక్కడెందుకు?


ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కూడా దాదాపు అదే ఫలితాన్ని అందుకుంది. సినిమా బాగోకపోతే సినిమా చూడడానికి కూడా ఆసక్తి చూపించని ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ మీద మాత్రం ఎందుకు అంత ప్రేమ కురిపించారు అని ఆలోచించారా? అయితే ఈ ప్రేమ మొత్తం ప్రభాస్ ఒక్కడి మీదే కాదండోయ్. ఒకవేళ నిజంగానే ఆహా చెప్పినట్టు ప్రభాస్ కారణంగానే ఆహా నిలిచిపోయిన సరే దీని వెనుక అందరి హీరోల పాత్ర ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ వివాదరహితుడు, ఏ హీరోతోనూ గొడవ లేదు. ఏ హీరో అభిమానులతోనో ప్రభాస్ అభిమానులు కూడా పెద్దగా గొడవలు జోలికి వెళ్లరు.


అందరు హీరోల ఆసక్తితోనే ఇలా?


కొన్ని సందర్భాల్లో వెళ్ళినా సరే ప్రభాస్ మీద మాత్రం ఆ ప్రభావం పడదు. దానికి తోడు నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణ ప్రభాస్ మధ్య ప్రోమోల్లో కనిపించిన సాన్నిహిత్యాన్ని చూసేందుకు ఆసక్తి చూపించారు. అదేవిధంగా రాంచరణ్ తో కాల్ మాట్లాడించడంతో మెగా అభిమానులు, పవన్ అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇక వీటికి అదనంగా షోలో గోపీచంద్ కూడా పాల్గొంటున్నాడు అని చెప్పడంతో గోపీచంద్ అభిమానులు కూడా తోడయ్యారు. సో ఇలా ఇంతమంది అభిమానులు ఒక్కసారిగా ఆహాలో ఈ షో ఎపిసోడ్ చూసేందుకు ఆసక్తి చూపించడంతోనే ఆహా యాప్ క్రాష్ అయి ఉండవచ్చు. ప్రభాస్ ఒక్కడికే క్రెడిట్ ఇచ్చేయడం మాత్రం ఆహా తప్పిదం అని అంటున్నారు ఇతర హీరోల అభిమానులు. మరి దీని మీద మీ స్పందన ఏమిటో కూడా తెలియజేయండి.


Also Read: Rishabh Pant Accident: 'పంత్'ను గుర్తుపట్టలేదు.. చూడగానే చనిపోయాడనుకున్నా కానీ అమ్మకి ఫోన్ చేయమన్నాడు!


Also Read: Ananya Panday Hot Photos: బ్యాంకాక్ లో పొట్టిబట్టల్లో రెచ్చిపోయిన అనన్య..అమితాబ్ మానవరాలితో కలిసి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook