Bus Driver Sushil Who Saved Rishabh Pant opens up on Accident: రిషబ్ పంత్‌కు ప్రమాదం తర్వాత అతన్ని దైవదూతలా వచ్చి కాపాడిన హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్ సుశీల్ ఆ రాత్రి జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. ప్రమాదం తర్వాత పంత్‌ను రక్షించడంలో సుశీల్ కీలక పాత్ర పోషించాడన్న సంగతి తెలిసిందే. ఇక సుశీల్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ప్రమాదానికి గురైన వ్యక్తి బతకడం కష్టమని ముందు భావించాడట. అయినా తన ప్రయత్నాలు తాను చేస్తూ పంత్ ప్రాణాన్ని కాపాడిన సుశీల్ ధైర్యసాహసాలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి సుశీల్ కుమార్ హర్యానా రోడ్‌వేస్‌లోని పానిపట్ డిపో డ్రైవర్. బస్సులో 30 మంది ప్రయాణికులతో సుశీల్ హరిద్వార్ నుండి పానిపట్ వెళ్తున్నాడు. ఆయన నడుపుతున్న బస్సు తెల్లవారుజామున 4.25 గంటలకు బయలుదేరింది. తాము ఉదయం 5.15 గంటలకు గురుకుల్ నర్సన్‌కు చేరుకున్నామని సుశీల్ చెప్పుకొచ్చారు. పొగమంచు కారణంగా ఆ సమయంలో విజిబిలిటీ చాలా తక్కువగా ఉందని, 300 మీటర్ల వరకు కూడా ఏమీ కనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఢిల్లీ వైపు నుంచి అతి వేగంతో ఒక కారు వస్తూ కనిపించిందని పేర్కొన్న ఆయన కారును చూడగానే డ్రైవర్ అదుపు తప్పిపోయినట్లు అనిపించిందని, క్షణాల్లో కారు డివైడర్‌ను ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత కారు అనేక పల్టీలు కొట్టిందని చెప్పుకొచ్చిన ఆయన ఆ కారు మా బస్సును ఢీకొంటుందని ఒక్క నిమిషం భయపడ్డానని, అది మా బస్సును ఢీకొనకుండా ఉండేందుకు బస్సును స్లో చేసి రైట్ టర్న్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక కారుకు మంటలు అంటుకోగానే సుశీల్, బస్ కండక్టర్ పరమజిత్ సింగ్ సహా మరికొందరు ప్రయాణికులు బస్సు నుండి దిగి కారు డ్రైవర్‌కు సహాయం చేయడానికి పరిగెత్తామని చెప్పుకొచ్చారు. అప్పటికే కారులో మంటలు చెలరేగాయని, దీంతో అది ఏ కారు అని కూడా నేను గుర్తించలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కారు డ్రైవర్ చనిపోయాడని అనుకున్నానని ఎందుకంటే ఆయనకు రక్తం కారుతోందని, అతని నుదిటిపై, వీపుపై గాయాలు ఉన్నాయని అన్నారు.
నేనూ, కండక్టరూ అతన్ని బయటకు లాగి పక్కన కూర్చోబెట్టాము, వెంటనే 112కి ఫోన్ చేసి పోలీసులకు, హైవే అధికారులకు సమాచారం అందించామని అన్నారు. ఇక కొంత సేపటికి కారు డ్రైవర్ స్పృహలోకి వచ్చాడని అప్పుడు పంత్ స్వయంగా తాను భారత జట్టులో క్రికెటర్ అని చెప్పాడని దీంతో తాము అతనిని కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అడిగామని దానికి అతను తాను ఒంటరిగా ప్రయాణిస్తున్నానని చెప్పాడని అన్నారు. ఆ తర్వాత అతను తన తల్లికి కాల్ చేయమని అడిగాడు, కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, ఈలోపు ఆయన చలికి బాగా వణుకుతున్నాడని బస్సులో ఒక ప్రయాణీకుడి నుండి దుప్పటిని అడిగి ఆయనకు కప్పామని అన్నారు.
ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆయన పెద్దగా మాట్లాడలేకపోయారని అయితే కొద్దిసేపటికి పోలీసులు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయని అన్నారు. నిజానికి పంత్ తానంతట చెప్తే కానీ తాను గుర్తించలేకపోయానని సుశీల్ చెప్పాడు. ఇక కర్నాల్‌లోని బల్లా గ్రామానికి చెందిన సుశీల్, తాను గత తొమ్మిదేళ్లుగా బస్సు నడుపుతున్నానని, హైవేపై అనేక ప్రమాదాలు చూస్తూ ఉంటానని క్షతగాత్రులను ఆదుకోవడమే నా మొదటి ప్రయత్నం అని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ పంత్ ఉన్నారా? లేక ఇంకెవరు ఉన్నారు అని చూడనని మనిషిని రక్షించడమే తన ప్రధమ కర్తవ్యం అని అన్నారు.
Also Read: Rishabh Pant's Money Looted: యాక్సిడెంట్ అయి పడి ఉంటే రిషబ్ పంత్ డబ్బు లూటీ చేశారా?
Also Read: Mahabubabad Accident: నూతన సంవత్సరాది ముందు తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో 8 మంది దుర్మరణం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook