Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ లో ట్విస్ట్.. పుష్ప 2 కోసం బన్నీకి ఇచ్చింది అంత కాదంట..!
Allu Arjun Remuneration: గత కొద్దిరోజులుగా పుష్ప సినిమా కోసం.. అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ పై తెగ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఇప్పటివరకు ఏ హీరో తీసుకోనంత.. ఇ రెమ్యునరేషన్ పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ అందుకున్నారనే వార్తలు తెగ వినిపించాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది.
Pushpa 2 Remuneration: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పుష్ప 2. డిసెంబర్ 5న పాన్ ఇండియా.. పరంగా ఎన్నో భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. ఇప్పటికే ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా టికెట్ ధరలు నైజాంలో ₹1200 వరకు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ₹900 వరకు ఉంటున్నాయి.
ఈ సినిమా ₹400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్ల వ్యాపారం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందిహ అల్లు అర్జున్ ఈ చిత్రానికి ₹300 కోట్ల.. పారితోషికం పొందుతున్నాడనే వార్తల తెగ వినిపించాయి. ఇక అదే కాకుండా..ఒప్పందం ప్రకారం.. సినిమా బిజినెస్‌లో 27% అంటే ₹270 కోట్లు అందుకోవాల్సి ఉంది. కానీ మైత్రీ మూవీ మేకర్స్ పారితోషికాన్ని 24%కు తగ్గించి, ₹240 కోట్లను మాత్రమే చెల్లించినట్లు సమాచారం.
ఈ తగ్గింపుపై తెలుగు ఫిలింనగర్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. తలపతి విజయ్ తన తదుపరి సినిమాకు ₹275 కోట్లు, రజనీకాంత్ జైలర్ కు ₹250-₹270 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అల్లు అర్జున్ పారితోషికం ఈ ద్రుష్టికోణంలో తక్కువగా ఉంది. అయితే ఇండియాలోనే అత్యంత రమ్యునరేషన్ తీసుకుంది అల్లు అర్జున్ అంటూ ఇప్పటికే ఎన్నో మీడియా ఛానల్లు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ గురించి వస్తూ ఉన్న వార్త నిజమా కాదా తెలియాలి అంటే.. ఎవరో ఒకరు బయటపడాల్సిందే.
ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న నిర్ణయాలపై క్లారిటీ లేకపోయినా, 'పుష్ప 2' ప్రేక్షకులను మెప్పించి ఘన విజయాన్ని సాధిస్తుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.
ఇక ఈ సినిమాకి మూడో భాగం కూడా ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఈ మూడో భాగానికి పుష్ప ది రాంపేజ్ అనే టైటిల్ని నిర్ణయించారు సినిమా యూనిట్.. అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రం ఇప్పుడల్లా మొదలు కాదని.. అల్లు అర్జున్ మధ్యలో సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయాల్సి ఉందని.. ఆ చిత్రం తరువాతే మరలా పుష్ప 3..షూటింగ్లోకి రావచ్చని వినికిడి
Also Read: YS Sharmila: సముద్రంలో పవన్ కల్యాణ్ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి
Also Read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..! .. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.