Udvegam: తెలుగులో కోర్టు డ్రామా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తర్వాత తెలుగులో ఈ తరహా చిత్రాలకు మళ్లీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఇదే కోర్టు డ్రామా నేపథ్యంలో ‘ఉద్వేగం’ సినిమా తెరకెక్కించారు. కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై  జి శంకర్, ఎల్ మధు నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు.  అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు.
 
త్రిగున్ లీడ్ రోల్లో నటిస్తూన్న ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించించింది.  శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా త్రిగున్ కు ఇది 25వ చిత్రం కావడం విశేషం.  తెలుగులో ఈ తరహా   కోర్టు రూము డ్రామాతో వచ్చే  చిత్రాలు చాల తక్కువ అని చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కాన్సెస్ట్ కూడా వెరైటీగా ఉండనున్నట్టు చెప్పారు. అంతేకాదు ప్రేక్షకులు ఈ సినిమా చూసి థ్రిల్ ఫీలవుతారన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మెయిన్ స్ట్రీమ్ పాయింట్ ను ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22వ  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  


మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిగున్, దీప్సిక, శ్రీకాంత్ భరత్, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి ముఖ్యపాత్రల్లో నటించారు. అజయ్ ఫోటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. జి. శంకర్, ఎల్. మధు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.