బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Death Case) దర్యాప్తును బిహార్ పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముంబైలోని సుశాంత్ సోదరి, నటుడి మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖాండే, సుశాంత్ స్నేహితులు, అతడి ఇంట్లో పని మనుషులు, ఇలా పలువురిని విచారించి వారి వాంగ్మూలాలు సేకరించినట్లు బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే శనివారం తెలిపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సుశాంత్ లేటెస్ట్ గాళ్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) జాడ మాత్రం దొరకడం లేదన్నారు. సుశాంత్‌ నా 4 సినిమాలు రిజెక్ట్ చేశాడు: భన్సాలీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుప్తేశ్వర్ పాండే శనివారం మీడియాతో మాట్లాడారు. సుశాంత్ కేసు (Sushant Singh Rajput Case)కు సంబంధించి ప్రాథమిక ఆధారాలను ముంబైలో ఉన్న నలుగురు బిహార్ పోలీసుల టీమ్ సేకరించినట్లు తెలిపారు. సుశాంత్ సోదరి, మాజీ ప్రేయసితో పాటు స్నేహితులు, అతడి ఇంట్లో పనివారిని విచారించి పలు విషయాలు, ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా సుశాంత్ బ్యాంక్ ఖాతాల నుంచి జరిగిన లావాదేవీల వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారని చెప్పారు. CoronaVirusపై 110 ఏళ్ల బామ్మ అలవోక విజయం


సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు, అతడి ప్రేయసి రియా చక్రవర్తి ఎక్కడ ఉందో, జాడ తెలియడం (Unable to locate Rhea Chakraborty) లేదన్నారు బిహార్ డీజీపీ. సుప్రీంకోర్టు ఏం చెప్పినా స్వాగతించేందుకు సిద్ధమేనని, అయితే బిహార్ పోలీసులకు అవకాశమిస్తే సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కచ్చితంగా గుర్తించి, పట్టుకుని అతడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే..


కాగా, బిహార్‌లోని పాట్నాకు చెందిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్‌లో పలు సినిమాలలో నటించి మెప్పించాడు. కానీ డిప్రెషన్ సమస్యతో బాధపడుతూ జున్ 14న ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన కుమారుడి మరణంపై నటి రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీ సహా మొత్తం ఏడుగురిపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు బిహార్ పోలీసుల టీమ్ ముంబైకి వెళ్లి విచారణ చేపట్టింది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్ 
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos