UV creations Releasing Kalyanam Kamaneeyam for Sankranthi 2023: సాధారణంగా సంక్రాంతి పండుగ సినిమాలకు కూడా ఒక పండగ లాంటి సీజన్. ఎందుకంటే రెండు, మూడు సినిమాలు విడుదల చేసినా సంక్రాంతి సమయంలో వాటి డబ్బులు రాబట్టుకునే స్కోప్ ఉంటుంది. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మరోపక్క దిల్ రాజు తన నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ ను హీరోగా నటింపజేసిన వారసుడు సినిమాను కూడా రంగంలోకి దించుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాని తమిళ సినిమా అని చెబుతూ తెలుగులోకి డబ్బింగ్ చేస్తూ తన ఆధ్వర్యంలో ఉన్న ధియేటర్లలో రిలీజ్ చేయడమే గాక మరిన్ని థియేటర్లు కేటాయించుకునే పనిలోపడ్డారు. ఇక ఈ విషయం మీద కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా దిల్ రాజు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇప్పటికే రెండు తెలుగు సినిమాలకు థియేటర్లు దక్కక ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు కొత్తగా యూవీ క్రియేషన్స్ ఒక చిన్న సినిమాని సంక్రాంతి బరిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా పేరు కళ్యాణం కమనీయం కాగా ఆ సినిమాలో హీరోగా నటించింది డైరెక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్.


ఈ సినిమా లో తమిళ భామ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. యూవి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో 14వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ బాబు తర్వాత అత్యధిక థియేటర్లు యూవీ క్రియేషన్స్ సంస్థ అండర్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి తెలుగులో విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల థియేటర్ల కౌంట్ మీద కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. నిజానికి సంక్రాంతి సీజన్ కి అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.


కానీ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రెండు సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్లు దొరకవు అనే ఉద్దేశంతో దాన్ని వాయిదా వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ దగ్గర ఉన్న థియేటర్లను వేరే ఎవరికీ కేటాయించకుండా యువి క్రియేషన్స్ సంస్థ తెలివిగా నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. దిల్ రాజుకు కేటాయిస్తే మైత్రి మూవీ మేకర్స్ తో ఇబ్బంది మైత్రి మూవీ మేకర్స్ కి కేటాయిస్తే దిల్ రాజుతో ఇబ్బంది. అందుకే వారిద్దరినీ పక్కనపెట్టి తమ దగ్గర ఉన్న ఒక చిన్న సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: నన్ను మెడపట్టి గెంటేశారని రాశారు.. అప్పటి విషయం బయటపెట్టిన తెలుగు లిరిసిస్ట్!


Also Read: Allu Aravind: అలా నలుగురి చేతుల్లోకి థియేటర్లు.. లోగుట్టు బయటపెట్టిన అల్లు అరవింద్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook