Tollywood Lyricist Kittu Vissapragada Reveals Bad Experience with Media: తెలుగు లిరిసిస్ట్ కిట్టూ విస్సాప్రగడ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సూపర్ హిట్ సాంగ్స్ కు లిరిక్స్ అందించిన ఆయన తాజాగా తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. అసలు విషయం ఏమిటంటే ఇటీవల అడవి శేషు హీరోగా విడుదలైన హిట్ 2 సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన తన అభిమానులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఒక లేడీ ఫ్యాన్ డేట్ కి వెళదామా అని అడిగితే కచ్చితంగా వెళదామని చెబుతూ హిట్టు 2 సినిమాకి వెళ్దామని పేర్కొన్నారు. అయితే ఆ విషయం మీద వెబ్సైట్స్ పలు రకాలుగా వార్తలు రాయడంతో సదరు నెటిజన్ మరో ట్వీట్ పెట్టింది. దయచేసి ఇలాంటివి డిలీట్ చేయండి, మా అమ్మ నాన్న చూస్తే నా పని అయిపోతుంది అంటూ కామెంట్ చేయడంతో దానికి కిట్టూ విస్సాప్రగడ ఆసక్తికరంగా ఒక కామెంట్ చేశారు.
Thank you. Honoured.
I once gave an interview to a newspaper. They posted an article and I was all proud, happy and couldn't wait for my father to read coz i told abt him in high regards. "ma nanna na kadupuna chebabuttav kada ra ani nannu meda patti gentesaru" ani rasadu 🙄— Kittu Vissapragada ( కిట్టు విస్సాప్రగడ) (@KittuVissaprgda) December 5, 2022
తాను గతంలో ఒక న్యూస్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇచ్చానని వాళ్లు పేపర్ లో ఒక ఆర్టికల్ వేశారని నేను అది చూసి చాలా గర్వపడ్డాను, మా నాన్న అది చదివే వరకు నాకు ఒక రకంగా ఆనందం ఆగలేదని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే మా నాన్న నా కడుపున చెడబుట్టావు కదరా అని నన్ను మెడపట్టి గెంటేశారు అని వాళ్ళు రాశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది ఏ పేపర్, అసలు పూర్తి విషయం ఏమిటి అనే విషయాన్ని మాత్రం ఆయన బయట పెట్టలేదు.
ఇక ఎటు చూసినా నువ్వే అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి చెందిన వ్యక్తి. ఆయన పూర్తి పేరు విస్సాప్రగడ రవికృష్ణ కాగా తన కెరీర్ ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత హుషారు సినిమాలో ఉండిపోరాదే అనే సాంగ్ ఆయనకు మంచి బ్రేక్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫలక్నామా దాస్, మన్మధుడు 2, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాలకు ఆయన లిరిక్స్ అందించారు.
Also Read: Stunt Man Died: సినిమా షూటింగ్‌లో అపశృతి.. స్టంట్‌మ్యాన్ మృతి.. నోరు విప్పని యూనిట్
Also Read: Adivi Sesh Lady Fan: మొన్న డేటన్నది, ఇప్పుడు డిలీట్ చేయమంటోంది..వారి కంట పడితే అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి